Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పేదింటి ఆడ పిల్ల ఇంట్లో చిరునవ్వులు చిందించాలనే కల్యాణలక్ష్మి.. మంత్రి పువ్వాడ!

పేదింటి ఆడ పిల్ల ఇంట్లో చిరునవ్వులు చిందించాలనే కల్యాణలక్ష్మి.. మంత్రి పువ్వాడ!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంక్షేమం ఆగలేదు.. ఆగదు.
రాష్ట్రంలో నిర్విరామంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు..
127 మంది లాబ్దిదారులకు గాను రూ.1.27 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు.
చెక్కు, చీర తో పాటు లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్క హామి నిర్విరామంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం అర్బన్ లో మంజూరైన 127 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గానూ రూ.1.27 కోట్ల విలువైన చెక్కులను ఖమ్మం vdo’s క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణీ చేశారు.
అనంతరం ఆయా లబ్ధిదారుల కలిసి సహపంక్తి భోజనం చేశారు. వారితో కలిసి కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల వద్ద అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఎస్సీ ఎస్టీ ,బిసి, మైనార్టీ ఆడపిల్లలకు అన్ని వర్గాల ప్రజలకు కు అన్న గా అండగా ఉంటానని ఇచ్చిన హామి మేరకు కల్యాణలక్ష్మీ, షాది ముభారక్ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.

కల్యాణలక్ష్మి రూపంలో మొదటిగా 50,000, తరువాత 75,000 నుంచి, నేడు లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం వల్ల ఆ ఇంటికి అండగా, పెద్దన్నగా నిలిచారన్నారు. పెళ్లి సమయంలో ఒక వేళ అప్పు చేసినా కల్యాణలక్ష్మి వల్ల అప్పు తీర్చవచ్చు అన్న ధైర్యం తల్లిదండ్రులకు కల్పించారని అన్నారు.

పేద ఇంటి ఆడపిల్ల కుటుంబానికి అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ కళ్యాణ లక్ష్మి రూపంలో వారిని ఆదుకుంటున్నామన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పథకం ప్రకారమే ఆసరా పింఛన్ రైతుల కొరకు రైతుబంధు, రైతు భీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అవన్ని నిర్విరామంగా, విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని సీఎం కేసీఅర్ కోరిక అని తెలిపారు.మహిళలు ఈ కళ్యాణలక్ష్మి డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు.

ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అన్నారు.సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర కరంట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదని, కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అన్ని పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్కే దక్కుతుంది అన్నారు.ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ శక్తులూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేవని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా , జిల్లా కలెక్టర్ VP గౌతమ్ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, MRO శైలజ , సుడా చైర్మన్ విజయ్ , అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు తెలుగు వ్యక్తుల దుర్మరణం

Drukpadam

చెన్నైలో ఉన్నట్టుండి బైక్ లో మంటలు.. గాయాలతో తప్పించుకున్న యజమాని!

Drukpadam

తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లు…!

Drukpadam

Leave a Comment