Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డోర్నకల్ లో వీఆర్ఏలకు(ప్రెస్ క్లబ్)జర్నలిస్టుల మద్దతు…

డోర్నకల్ లో వీఆర్ఏలకు(ప్రెస్ క్లబ్)జర్నలిస్టుల మద్దతు…
-వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి: టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
-సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
-వీఆర్ఏలకు(ప్రెస్ క్లబ్)జర్నలిస్టుల మద్దటు పట్ల ఉద్యోగుల హర్షం
-తమకు మద్దతు ప్రకటించి వంటావార్పు చేసిన జర్నలిస్టులకు కృతజ్నతలు

మహబూబాబాద్ జిల్లా.డోర్నకల్ మండల కేంద్రంలో . సెప్టెంబర్ 9 న స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు చేపట్టిన సమ్మెకు డోర్నకల్ ప్రెస్ క్లబ్ మద్దతుగా వంటావార్పు చేపట్టింది.వీఆర్ఏలకు రాష్ట్రంలోనే జర్నలిస్టులు మద్దతు ప్రకటించడం మొదటిదిగా భావిస్తున్నారు. భవిషత్ లో కూడా తమ మధ్య సంఘిభావము ఇలాగానే ఉండాలని కోరుకున్నారు .

47వ రోజైన శుక్రవారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన వివిధ పత్రికలు,టీవీ చానెళ్ల విలేకరులు వీఆర్ఏలకు సంఘీభావం తెలుపుతూ శిబిరంలో కూర్చున్నారు.ముఖ్యఅతిథిగా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్,ఎమ్మార్వో వివేక్,ఎస్సై రవికుమార్ విచ్చేసి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమస్య ఎక్కడుంటే జర్నలిస్టులు అక్కడ ఉంటారన్నారు.వీఆర్ఏల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని అభిప్రాయపడ్డారు.వారి సమస్యల పరిష్కారానికి మార్గం దొరికే వరకు వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చారు.సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.55 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గత అనేక ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు వీఆర్ఏలకు సంఘీభావంగా వంటవార్పుతో మధ్యాహ్న భోజనం అందజేశారు.వీఆర్ఏ మండల జేఏసీ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గండి సీతారాం గౌడ్,ప్రధాన కార్యదర్శి పిట్టల సరేష్, కోశాధికారి కుంటిగొర్ల రామకృష్ణ,ఉపాధ్యక్షులు మంద ప్రకాష్,జనం సాక్షి బ్యూరో ప్రశాంత్,సభ్యులు శ్రీనాథ్,యాకయ్య, నాగరాజు,సక్రం,రవి, సత్యనారాయణ,వెంకట్,కిరణ్,సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉదయం పూట తినకూడని ఆహారపదార్థాలు!

Drukpadam

భార్య అయినా సరే.. ఇష్టంలేని శృంగారాన్ని తిరస్కరించొచ్చు: ఢిల్లీ హైకోర్టు

Drukpadam

ప్రొఫెస‌ర్ సాయిబాబా కేసుపై రేపు సుప్రీంకోర్టులో అత్య‌వ‌స‌ర విచార‌ణ‌!

Drukpadam

Leave a Comment