Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బ్రిట‌న్ రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చార్లెస్‌- 3

బ్రిట‌న్ రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చార్లెస్‌- 3
గురువారం మ‌ర‌ణించిన బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌- 2
ఆమె పెద్ద కుమారుడి హోదాలో రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చార్లెస్‌- 3
కార్య‌క్ర‌మాన్ని తొలిసారిగా టీవీల్లో ప్ర‌సారం చేసిన వైనం

బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం మ‌ధ్యాహ్నం లండ‌న్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెష‌న్ కౌన్సిల్ ఆయ‌న‌ను బ్రిట‌న్ రాజుగా ప్ర‌కటించింది. మొన్న‌టిదాకా బ్రిట‌న్ రాణిగా కొన‌సాగిన ఎలిజ‌బెత్- 2 గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమె పెద్ద కుమారుడిగా ఉన్న చార్లెస్‌- 3ని బ్రిట‌న్ రాజుగా కౌన్సిల్ ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం 73 ఏళ్ల వ‌య‌సులో ఉన్న చార్లెస్‌- 3… బ్రిట‌న్ రాజరిక వ్య‌వ‌స్థ‌ల‌తో అత్యంత ఎక్కువ వ‌య‌సులో రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిగా రికార్డుల‌కు ఎక్కారు. బ్రిట‌న్ రాజుగా చార్లెస్‌- 3 ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న వెంట స‌తీమ‌ణి కెమిల్లా, కుమారుడు విలియంలు ఉన్నారు. ఇదిలా ఉంటే… బ్రిట‌న్ రాజుగా చార్లెస్- 3 ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో ప్ర‌సారం చేశారు. ఇలా రాజరిక మార్పు కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో ప్ర‌సారం చేయ‌డం ఇదే తొలిసారి.

Related posts

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు

Drukpadam

ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని?: అసెంబ్లీలో గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

ఎన్నికల్లో అల్లర్ల నేపథ్యంలో ఏపీలో ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారి …

Ram Narayana

Leave a Comment