మును “గోడు ” ప్రభావం కమ్యూనిస్టులమీదనే అధికం …
-రాష్ట్రంలో టీఆర్ యస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న తరణంలో -మద్దతుగా నిలిచినా కమ్యూనిస్టులు
-ప్రజాసమస్యలపై నిలదీయాల్సిన కమ్యూనిస్టులు ప్రభుత్వానికి అంటగగటమేమిటని ప్రశ్న
-ఉద్యోగ నియామకాలు అంతంత మాత్రమే …నిరుద్యోగ భృతిలేదు
-ఉద్యోగుల సమస్యలు తీరలేదు .. ఉపాధ్యా సమస్యలపై స్పందనలేదు
-విఆర్ ఓ ల దీక్షలకు కరగలేదు …
-పేదలకు అందని ద్రాక్షలా విద్య -వైద్యం …
-ధరల పెరుగుదలపై నియంత్రణ లేదు ..
-రైతులకు గిట్టుబాటు ధరలు లేవు .
మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందో ,ఏ పార్టీ ఓడిపోతుందో చెప్పలేముగాని దీని ప్రభావం అన్ని పార్టీలకంటే కమ్యూనిస్టులమీద ఎక్కువ చూపే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమ్యూనిస్టులను ఎన్నడూ దగ్గరకు రానివ్వలేదు . పైగా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఎం ఎల్ పార్టీని సైతం పట్టించుకోలేదు. కేసీఆర్ ను కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకోని వచ్చిన సందర్భంగా పోలీస్ వాహనానికి అడ్డం పడిన పీడీఎస్ యూ , పీవైఎల్ కార్యకర్తల పోరాటపటిమను గుర్తించలేదు . ఇక ఉభయ కమ్యూనిస్టులను ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు . మునుగోడు ఉపఎన్నికల్లో మాత్రం వారి ప్రాపకంకోసం చేయని ప్రయత్నం లేదు . వారికోసం ప్రగతి భవన్ లో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు . విందు భోజనాలతో వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు . దీంతో వాపమపక్షాల మద్దతుపై ప్రజల్లో చాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగం , ఉద్యోగుల సమస్యలు , ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరానికి నోచుకోలేదు . రైతులకు గిట్టుబాటు ధర లేదు . నిరుద్యోగ భృతిలేదు . అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగింది. అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరానికి నోచుకోవడంలేదు . విద్య ,వైద్యం పేదలకు అందుబాటులో లేదు . ధరలు పెరుగుదల ,భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు విఫరీతంగా పెంచారు . ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు వారిపై భారాలు మోపుతూ ఎంజాయ్ చేస్తున్నారు . దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఫీజు రియంబర్స్ మెంట్ చేయడంలేదు. పైగా భారీగా ఫీజులు పెంచి ఉన్నత విద్యను పేదలకు దూరం చేస్తున్నారు . ఇదేమని అడిగితె జవాబు ఇవ్వడంలేదు . దీంతో ఉన్నత విద్య డబ్బులు ఉన్నవాళ్ళకి మాత్రమే అనే అభిప్రాయాలూ కలుగుతున్నాయి. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా లేని తరుణంలో వచ్చిన మునుగోడు ఉపఎన్నికలో వామపక్ష పార్టీలు టీఆర్ యస్ కు మద్దతు సమంజసం కాదనే అభిప్రాయాలే బలంగా వినిపిస్తున్నాయి .
అయితే అక్కడ టీఆర్ యస్ , బీజేపీలకే పోటీ అని అందువల్లనే బీజేపీని ఓడించేందుకు టీఆర్ యస్ కు మద్దతు ఇస్తున్నామని వామపక్షాలు చెబుతున్న వాదన ప్రజలను కన్విన్స్ చేయలేకపోతోంది. దీనిపై సిపిఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు . ఆయన ఏమన్నారంటే ….
మునుగోడు ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్‌తో పొత్తు అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని స్పష్టం చేస్తున్నారు … అంతేకాకుండా టీఆర్ఎస్ అంటే తమకు ప్రేమ లేదని అదే సందర్భంలో కాంగ్రెస్ అంటే కోపమేమీ లేదని కూడా అంటున్నారు …టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నేపథ్యంలో కాంగ్రెస్ కన్నా టీఆర్ యస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుందని ఆయన జోశ్యం చెప్పారు …
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీలపై వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న విమర్శలపై తాజాగా సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు.
టీఆర్ఎస్‌తో పొత్తు తాత్కాలికమేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు మునుగోడు ఉప ఎన్నికల వరకు మాత్రమేనని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ అంటే తమకేమీ కోపం లేదన్న తమ్మినేని… అదే సమయంలో టీఆర్ఎస్ అంటే తమకేమీ ప్రేమ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతున్న నేపథ్యంలోనే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.