Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కమ్యూనిస్టుల త్యాగాలవల్లనే తెలంగాణ విలీనం జరిగింది.:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

కమ్యూనిస్టుల త్యాగాలవల్లనే తెలంగాణ విలీనం జరిగింది.:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
-నల్లటి తెలంగాణ గడ్డను ఎర్రగడ్డగా మార్చిన చరిత్ర కమ్యూనిస్టులది
-సంస్థానాల విలీనంతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ విమోచనపేరుతో ఉత్సవాలు జరపడం సిగ్గు చేటు…
-చరిత్రను వక్రీకరించడం ,సర్దార్ వల్లభాయ్ పటేల్ ,మావాడు అనడం బీజేపీకే చెల్లింది.
-గాంధీని చంపిన గాడ్సే వారసులు పాలన కొనసాగించడానికి అనర్హులు
-బీజేపీ పాలన కరోనా కంటే డేంజర్

కమ్యూనిస్టుల త్యాగాలవల్లనే తెలంగాణ విలీనం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు . శుక్రవారం ఖమ్మం లోని సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవనం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచనా…విలీనమా అని జరుగుతున్న చర్చ అసమంజసం అని ఇది బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమని అని పేర్కొన్నారు . సాయుధ తెలంగాణ పోరాటం వల్లనే నాడు నైజం నవాబ్ నెహ్రు సైన్యాలకు లొంగక తప్పలేదని అన్నారు . ఈ సందర్భంగా దేశంలో అనేక సంస్థానాలు విలీనం అయిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు . గాంధీని చంపిన గాడ్సే వారసులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పై ధ్వజమెత్తారు . కమ్యూనిస్టుల త్యాగాలు ,ఆత్మబలిదానాలవల్లనే నల్లటి తెలంగాణ ఎర్రగడ్డగా మారిందని ఈ గడ్డ ఏనాటికైనా కమ్యూనిస్టుల గడ్డగానె నిలుస్తుందని అందుకోసం తమ ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు . తెలంగాణ పోరాటంతోగాని , వీలినంతోగాని ఏమాత్రం సంబంధం లేని బీజేపీ తామే తెలంగాణ విమోచనా చేశామని చెప్పడం ,సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడే అని చెప్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు . రావి నారాయణ రెడ్డి , ముగ్దుమ్ మొహినుద్దీన్ , బద్దం ఎల్లారెడ్డి , రాజాబాహుదుర్ గౌర్ , ధర్మ భిక్షం లాంటి అనేక మంది పోరాట యోధుల ఫలితంగా తెలంగాణ విలీనమైన విషయాన్నీ సాంబశివరావు గుర్తు చేశారు . వారి విగ్రహాలను ట్యాంక్ బ్యాండ్ పై పెట్టాలని డిమాండ్ చేశారు . అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన వేలాది మంది అమరవీరుల స్మృతి కోసం మ్యూజియం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు .

దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు మతాలను , ప్రాంతాలను రెచ్చగొట్టడం , ప్రతిపక్ష పార్టీలను చీల్చడం పనిగా పెట్టుకున్నాడని విమర్శలు గుప్పించారు . బీజేపీ విధానాలు కరోనా కంటే డేంజర్ అని పేర్కొన్నారు . విలేకర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు భాగం హేమంతరావు , జిల్లా కార్యదర్శి పోతూ ప్రసాద్ , జిల్లా సిపిఐ నాయకులూ జమ్ముల జితేందర్ రెడ్డి , ఎర్ర బాబు , జానీమియా , కరుణాకర్ , వి వి పాలెం సర్పంచ్ లు పాల్గొన్నారు .

Related posts

అగ్రనాయకుల మధ్య చిచ్చుకు కారణమైన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీలు…

Drukpadam

ఈనెల 24 న కాంగ్రెస్ గూటికి డి.శ్రీనివాస్ …

Drukpadam

పీఎం మోడీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ …!

Drukpadam

Leave a Comment