Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ ఐదు రకాల ‘టీ’లతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం …

How to Use Herbs For Tea - Fresh or Dried - GettyStewart.com

భోజనం ఎక్కువై ఇబ్బంది అవుతోందా..? ఈ ఐదు రకాల ‘టీ’లతో ఉపశమనం ఉంటుందంటున్న నిపుణులు!

  • వాము, తులసి, పుదీనా వంటి వాటితో టీ చేసుకుని తాగాలని సూచన
  • అజీర్ణం, కడుపుబ్బరం సమస్యలకు ఇవి పరిష్కారంగా పనిచేస్తాయని వెల్లడి
  • శరీరం కూడా శుభ్రమవుతుందని, రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుందని వివరణ
Detox teas to sooth gassy feeling after heavy dinner

మనం నిత్యం తినే ఆహారానికి తగినట్టుగా మన శరీరం, జీర్ణ వ్యవస్థ అలవాటు పడి ఉంటాయి. అవికాకుండా వేరే రకాల ఆహారం తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ భిన్నంగా స్పందిస్తుంటుంది. ఒక్కోసారి ఫంక్షన్లలోనో, పార్టీల్లోనో అతిగా తినేస్తుంటారు. అందులోనూ ఏడెనిమిది రకాల వెరైటీలు, స్వీట్లు, అవీ ఇవీ తీసుకుంటుంటారు. ఆ ఫుడ్‌ లో మసాలాలు, బట్టర్‌, నూనెలు వంటివి ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి సమయంలో కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి ఈ సమస్యలు రెండు, మూడు రోజుల పాటు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఐదు రకాల డిటాక్స్‌ (శరీరాన్ని శుభ్రం చేసే) డ్రింక్స్‌ ద్వారా ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవి శరీరాన్ని ఇబ్బందిపెట్టే పదార్థాలను శుభ్రం చేసి, తేలిక చేస్తాయని వివరిస్తున్నారు.

1. వాము టీ 
శరీరంలో విష పదార్థాలను బయటికి పంపి శుభ్రపర్చడంలో వాము బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా వీటిలోని రసాయనాలు మనలో ఒత్తిడి తగ్గించేందుకు, బరువు తగ్గేందుకు తోడ్పడతాయని వివరిస్తున్నారు. తిన్నది సరిగా అరగకపోవడం, గ్యాస్‌, ఉబ్బరం సమస్యలకు వేగంగా ఉపశమనం కలిగిస్తుందని వెల్లడిస్తున్నారు. కొంత వామును ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే సరిపోతుందని అంటున్నారు.

2. తులసి టీ 
శరీరంలో జీవక్రియలు (మెటబాలిజం) సమర్థవంతంగా కొనసాగేందుకు తులసి తోడ్పడుతుంది. ఇదే సమయంలో శరీరంలోని విష పదార్థాలను తొలగించి, శుభ్రం చేసే అద్భుతమైన సహజ లక్షణాలు తులసిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా శుభ్రమై సంబంధిత సమస్యలు తగ్గుతాయని వివరిస్తున్నారు. తులసి ఆకులను నేరుగా తిన్నా, నీటిలో వేసి మరిగించుకుని తాగినా ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

3. పుదీనా టీ 
శరీరంలో ఇన్ఫెక‌్షన్లను నియంత్రించేందుకు, రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి, జీర్ణ సమస్యలకు అన్నింటికీ పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక శరీరంలో ఫ్రీర్యాడికల్స్‌ ను నియంత్రించి కేన్సర్ల వంటివి రాకుండా అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు. పుదీనా టీ తాగడం వల్ల శరీరానికి మంచి ఉత్తేజం కూడా వస్తుందని వివరిస్తున్నారు.

4. అల్లం టీ 
రకరకాల విష పదార్థాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేయడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని సన్నగా తరిగి మరిగే నీళ్లలో వేసి కాసేపు ఉడికించి.. ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, జీర్ణ శక్తి మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. కావాలనుకుంటే అల్లం టీలో యాలకులు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఉత్సాహంగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు.

5. తేనె-నిమ్మ-అల్లం టీ 
తేనె, నిమ్మరసం, అల్లం కలిపిన టీతో జీర్ణ శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడూ కూడా శరీరాన్ని శుభ్రపరుస్తాయని.. జలుబు, గొంతు ఇన్ఫెక‌్షన్‌ వంటి వాటిని తగ్గిస్తాయని వివరిస్తున్నారు. రోజూ ఉదయమే ఈ టీ తాగడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

Related posts

జర్నలిస్ట్ హెల్త్ కార్డు సేవలను త్వరలో పరిష్కరిస్తా … ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు!

Drukpadam

కరోనా భయం …రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత!

Drukpadam

రూ. 10,716 కోట్ల లాటరీ.. బహుమతి తగిలినవాళ్లు ఇంకా చూసుకోలేదు..

Drukpadam

Leave a Comment