Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేశంలో అత్యంత సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ కు 3 స్థానం…

దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా కోల్ కతా… 

  • దేశంలో మూడో సురక్షిత నగరంగా హైదరాబాద్
  • రెండో స్థానంలో నిలిచినా పూణే
  • వివరాలను వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైద్రాబాద్ 3 వ స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం కోల్ కత్తా మొదటిస్థానంలో నిలిచింది. సురక్షిత నగరాలుగా పేరుపొందినవాటికి పెట్టుబడులు,పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి దార్లు ఎవరైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలను తమకు అనుకూలమైనవిగా భావిస్తారు . రెండవ స్థానంలో మహారాష్ట్రలోని పూణే కు చోటు లభించింది. ఇప్పటికే ఇక్కడ ఐ టి పరిశ్రమలు బాగా ఉన్నాయి. హైద్రాబాద్ కూడా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది.

 

ఎన్నో అంశాల్లో ప్రత్యేకతలను చాటుకుంటున్న హైదరాబాద్ నగరం మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత సుక్షితమైన నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా కోల్ కతా నిలిచింది. పూణే రెండో స్థానంలో ఉంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం… 2021లో 10 లక్షల మంది ప్రజలకు గాను 2,599 నేరాలు జరిగాయి. ఇదే సమయంలో ఢిల్లీలో 18,596 నేరాలు చోటు చేసుకున్నాయి. కోల్ కతాలో 1,034 నేరాలు… పూణేలో 2,568 నేరాలు జరిగాయి. కేవలం ఎనిమిదేళ్ల సమయంలోనే తెలంగాణ సురక్షిత నగరాల జాబితాలో చోటుచేసుకోవడం గమనార్హం. సురక్షిత నగరంగా పేరు తెచ్చుకోవడంతో… తెలంగాణకు పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Related posts

అవును.. మేము కుటుంబ రాజకీయాలు చేస్తున్నాం: స్టాలిన్

Drukpadam

2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం స్పష్టీకరణ!

Drukpadam

రాజస్థాన్ లో రాజ్యసభ ఎన్నికల వేడి …కాంగ్రెస్ ,బీజేపీ క్యాంపు రాజకీయాలు

Drukpadam

Leave a Comment