Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శాశ్వత అధ్యక్షుడి విషయంలో వైసీపీ వెనకడుగు !

జగన్ శాశ్వత అధ్యక్షుడి విషయంలో వైసీపీ వెనకడుగు !
-ఎన్నికల కమిషన్ జోక్యంతో నీళ్లు నములు తున్న వైసీపీ
-వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారంటున్న సజ్జల
-వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్
-శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరన్న ఎన్నికల సంఘం
-జగన్ ఐదేళ్ల వరకే అధ్యక్షుడిగా ఉంటారన్న సజ్జల

జగనే మా శాశ్విత అధ్యక్షుడు … అంటూ వైసీపీ అట్టహాసంగా జరిపిన ప్లీనరీ లో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే …ఇంతవరకు ఏ రాజకీయపార్టీ శాశ్విత అధ్యక్షడిని ఎన్నుకోలేదని మన రాజ్యాంగంలోని అదిలేదని స్పష్టం చేసింది. అంటే కాకుండా జగన్ శాశ్విత అధ్యక్షుడుగా అయినా ఎన్నిక చెల్లదంటూ ప్రకటించడంతో వెనక్కు తగ్గినా వైసీపీ తాను చేసిన తప్పిదానంపై నీళ్లు నములుతుంది. ఆపార్టీ నాయకులూ సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందించారు . జగన్ శాశ్విత అధ్యక్ష పదవికి అంగీకరించలేదని అంటున్నారు . అంతే కాకుండా తమ మినిట్స్ లో కూడా ఎక్కడ శాశ్విత అధ్యక్ష పదవి గురించి రాయలేదని ఆయన పేర్కొనడం గమనార్హం ..

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారని చెప్పారు. జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని… ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని అన్నారు.

Related posts

సోము వీర్రాజు తాగుబోతులకు అధ్యక్షుడా ఏంటీ?ఏపీ మంత్రి నారాయ‌ణ స్వామి!

Drukpadam

టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు…

Drukpadam

ప్రతిపక్షాలపై ఈడీ కక్ష …అవి రాజకీయ ప్రేరేపితం అంటున్న విశ్లేషకులు!

Drukpadam

Leave a Comment