పోడు సమస్యపై పోరుబాట …సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి .సాబీర్ పాషా..!
అంబసత్రం, పోడు భూములు దక్కించుకునేందుకు పోరాడుదాం
14న విజయవాడలో జరిగే ప్రజాప్రదర్శనకు భారీగా తరలిరావాలి
సాగుదారుల హక్కు పోడుభూములు
కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సమస్యను కేంద్రంగా చేసుకొని ఉద్యమాలను మరింత ఉదృతం చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో గురువారం జరిగిన సిపిఐ లక్ష్మి దేవిపల్లి మండల విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్మిదేవిపల్లి మండల ఏజెన్సీలో పోడు సమస్య, అంబసత్రం భూముల సమస్య త్రీవంగా ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంచూపడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంత గిరిజనులు, పేద వర్గాలకు భూముల నుంచి దూరం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు. అంబసత్రం భూములనే నమ్ముకొని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న పేదలకు ఆ భూములను స్వాధీనం చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మండలంలోని కేటిపిఎస్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి ఆ సంస్థ నిదులు కేటాయించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు క్పించాలని డిమాండ్ చేశారు. గడిచిన ఏనిమిదేళ్ళలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, అణగారిన వర్గాలపై దాడులు, అఘాయిత్యాలు హెచ్చమీరడంతో వారంగా అభద్రతాభావానికి గురవుతున్నారని, రోజురోజుకు మాన హక్కులు హరించబడుతున్నాయన్నారు. నిత్యావసరాలు, ఇందన ధరలు ప్రజలకు గుదిబండగా మారాయని, చీకటి చట్టాలను తీసుకువస్తూ కేంద్రం అన్ని వర్గాలపై ముప్పెటదాడికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజా హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణకోసం కమ్యూనిస్టులుగా ప్రజలను చైతన్యవంగా చేయాల్సిన భాద్యత మనపై ఉందన్నారు.
ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 14 నుంచి ఐదు రోజులపాటు జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని, 14న విజయవాడ నగరంలో జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభకు వేలాదిగా ప్రజలను తరలించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.నూనావత్ గోవిందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, మున్నా లక్ష్మి కుమారి, లక్ష్మి దేవిపల్లి మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, మండల నాయకులు దీటి లక్ష్మిపతి, కురిసే రత్నకుమారి, కంటెం శ్రీనివాసరావు, వెంకటనర్సయ్య, దార శ్రీనివాస్, కొదిలింగయ్య, వరుస రామస్వామి, పరుపర్తి రాజు, మల్లయ్య, కోడి లింగయ్య, రాంబాబు, బానోత్ నెహ్రు, ఎల్లావుల ఉపేందర్, బైకాని కృష్ణ, నూనావత్ చింటూ, కళ్లెం పూర్ణయ్య, లావుడియా కస్నా, సారయ్య, పోశం, నారాయణ, స్థానిక స్టాంస్థల ప్రజా ప్రతినిధులు పాడిగే భవాని, కొమరం లలిత, జోగా రాజబాబు, మంద గాబ్రియేలు దితరులు పాల్గొన్నారు.