Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ, తెలంగాణ లమధ్య చిచ్చు …పరస్పర ఆరోపణలు..

ఏపీ, తెలంగాణ లమధ్య చిచ్చు …పరస్పర ఆరోపణలు..
-హరీష్ రావు వైఖరిపై ఏపీ మంత్రుల ఆగ్రహం
-ఏపీ మంత్రుల ,వైఖరిపై తెలంగాణ మంత్రుల ఫైర్
-వైఎస్సార్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే: గంగుల క‌మ‌లాక‌ర్‌
-హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌జ్జ‌ల
-స‌జ్జ‌ల స్పంద‌న‌పై ఘాటుగా రిప్లై ఇచ్చిన గంగుల‌
-వైసీపీని స‌జ్జ‌ల ఉడుములా ప‌ట్టేశార‌ని ఆరోప‌ణ‌
-త‌మ జోలికి రావొద్ద‌ని వైసీపీ నేత‌ల‌కు సూచించిన తెలంగాణ మంత్రి

నిన్నమొన్నటివరకు మంచిగా ఉన్న తెలంగాణ ,ఏపీ ప్రభుత్వాలు ఒక్కసారిగా శత్రువైఖరిని ప్రదర్శిస్తున్నాయి. శ్రీశైలం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా లేని విధంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .దీనికి ప్రతిగా తెలంగాణ మంత్రులు కూడా దీటుగా స్పందింస్తున్నారు .దీంతో ఇరు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం ఆశక్తిగా మారింది.కేసీఆర్ ,జగన్ లమధ్య సంబంధాలు సరిగా లేవని అందువల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రోమారు మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో ఉపాధ్యాయుల‌పై కేసులు పెట్టి జైల్లో వేస్తోంద‌ని వైసీపీ స‌ర్కారుపై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు, వైసీపీ కీల‌క నేత‌లు వ‌రుస‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్‌తో హ‌రీశ్ రావుకు విభేదాలుంటే వాళ్లే ప‌రిష్క‌రించుకోవాల‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల‌పై తాజాగా తెలంగాణ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ శ‌నివారం స్పందించారు.

ప‌చ్చ‌ని కుటుంబాల‌ను విడదీయ‌డంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సిద్ధహ‌స్తుడ‌ని గంగుల ఆరోపించారు. ఇప్ప‌టికే వైఎస్సార్ కుటుంబాన్ని స‌జ్జ‌ల విచ్ఛిన్నం చేశార‌ని ఆరోపించారు. త‌ల్లిని కొడుకును విడ‌దీసిన స‌జ్జ‌ల‌… అన్నను, చెల్లిని కూడా విడ‌దీశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్సార్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన స‌జ్జ‌ల‌… ఇప్పుడు పచ్చ‌ని సంసారంలా సాగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని విడ‌దీయ‌డానికి య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. వైఎస్సార్ ఫ్యామిలీని విడ‌దీసిన‌ట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని స‌జ్జ‌ల విడ‌దీయ‌లేర‌ని గంగుల అన్నారు.

2014కు ముందు అస‌లు స‌జ్జ‌ల అంటే ఎవ‌రికి తెలుసు అని గంగుల అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైసీపీలో చేరిన స‌జ్జ‌ల‌… ఆ పార్టీని ఉడుములా ప‌ట్టేశార‌ని ఆరోపించారు. అస‌లు తెలంగాణ వ్య‌వ‌హారాల‌తో మీకేం సంబంధం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేశంలోనే తెలంగాణ ప‌థ‌కాలు మంచిగా ఉన్నాయ‌ని చెబుతున్నామ‌ని, ఆ క్ర‌మంలోనే ఇత‌ర రాష్ట్రాల పేర్ల‌ను, పొరుగు రాష్ట్రాల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. అయినా వైసీపీ పాల‌న బాగుంటే… హ‌రీశ్ వ్యాఖ్య‌ల‌తో స‌జ్జ‌ల ఎందుకు ఉలిక్కిప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ స‌త్తా ఏమిటో మ‌రోమారు చూపించాలంటే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌న్న గంగుల.. త‌మ‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 2014కు ముందు ఉద్య‌మంలోనే చూపించామ‌ని గుర్తు చేశారు. ఇక‌నైనా త‌మ‌తో పెట్టుకోవ‌ద్ద‌ని వైసీపీ నేత‌ల‌కు గంగుల సూచించారు.

 

 

Related posts

అసెంబ్లీలో స్పీక‌ర్‌పైకి కుర్చీ ఎత్తి ప‌డేసి విర‌గ్గొట్టిన ఒడిశా ఎమ్మెల్యే!

Drukpadam

చమురు ధరలపై ఏపీ మంత్రి పేర్ని నాని కేంద్రంపై ధ్వజం!

Drukpadam

రాజమండ్రి వైసీపీ లో ఇంటర్నల్ పంచాయతీ …రంగంలోకి దిగిన వై వి సుబ్బారెడ్డి!

Drukpadam

Leave a Comment