Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం రూరల్ సి ఐ ని తక్షణమే బదిలీ చేయాలనీ ఈనెల 10 పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన …సిపిఐ!

ఖమ్మం రూరల్ సి ఐ ని తక్షణమే బదిలీ చేయాలనీ ఈనెల 10 పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన …సిపిఐ!
-శాంతి భద్రతలు కాపాడాల్సిన సి ఐ అశాంతిని ప్రేరేపిస్తుంటే చర్యలు తీసుకోరా ? సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం
-నిన్ను చంపుతారని బెదిరింపులకు పాల్పడితే అధికారులు మిన్నకుండటం అన్యాయం
-రూరల్ లో శాంతి భద్రతల విఘాతానికి సి ఐనే కారణం ..
-ఒకే మండలంలో భార్యాభర్తలు ఉద్యోగం …చట్ట విరుద్ధం
-పోలీస్ స్టేషను పార్టీ కార్యాలయంగా మార్చిన సి ఐ పై చర్యలకు డిమాండ్

ఖమ్మం జిల్లా కేంద్రాన్ని అనుకుని ఉన్న ఖమ్మం రూరల్ మండలంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రావు వ్యవహార శైలి శాంతిభద్రతలకు విఘాతంగా ఉందని సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది.తమపార్టీకి చెందిన జిల్లా సహాయకార్యదర్శి దండి సురేష్ నుఉద్దేసించి నిన్ను చంపుతారంటూ సి ఐ బెదిరించడంపై సిపిఐ మండి పడింది. ప్రజల కష్టాల్లో ,నష్టాల్లో పాలుపంచుకుంటున్న తమ పార్టీ నేతలను భయబ్రాంతులకు గురిచేయాలనుకోవడం అవివేకమని స్పష్టం చేసింది. ఆయన శాంతి భద్రతలను కాపాడలిసిన అధికారిగా కాకుండా అధికార పార్టీ నేతగా వ్యవహరించడాన్ని సిపిఐ తప్పు పట్టింది.దీనిపై గత కొన్ని రోజులనుంచి తాము పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశామని కమిటీల పేరుతొ కాలయాపన చేస్తున్నారని విమర్శించింది .అందువల్ల తక్షణమే సి ఐ ని ఇక్కడ నుంచి బదిలీ చేయాలనీ సిపిఐ డిమాండ్ చేసింది.

ఈమేరకు ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయం గ్రిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు మాట్లాడుతూ సి ఐ పై అన్ని ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు .ఇలాంటి అధికారి వల్ల పచ్చాగాఉన్న పల్లెల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు . సి ఐని బదిలీ చేయాలనీ కోరుతూ ఈనెల 10 ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు . ఈ ఆందోళనలో తమపార్టీ రాష్ట్ర కార్యదర్శితో పాటు జిల్లా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలంతా పాల్గొంటారని అన్నారు.

ఒకే మండలంలో భార్యాభర్తలు తహసీల్దార్ ,సి ఐ లుగా పనిచేస్తున్న వైనం…

ఒకే మండలంలో భార్య తహసీల్దార్ గా ఉండగా భర్త సి ఐ గా పనిచేయడం చట్టవిరుద్ధమని హేమంతరావు అన్నారు .సిపిఐ నేతలపై ఎస్సి ,ఎస్టీ కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సిపిఐ నేతలు పిటిషన్ లు తీసుకోని పొతే పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు .విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్,సహాయ కార్యదర్శి దండి సురేష్, జమ్ముల జితేందర్ రెడ్డి ,జానీమియా ,కరుణాకర్ ,గోవిందరావు ,తదితరులు పాల్గొన్నారు .

Related posts

ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాలు

Drukpadam

ఐఐటీ ఉత్తీర్ణులకు ఆఫర్ల పంట..

Drukpadam

నవంబరు 11న విశాఖకు ప్రధాని..

Drukpadam

Leave a Comment