Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ వైపు దేశప్రజల చూపు… కెసిఆర్ సారధ్యంపట్ల విశ్వాసం : మంత్రి పువ్వాడ..

బీఆర్ యస్ వైపు దేశప్రజల చూపు… కెసిఆర్ సారధ్యంపట్ల విశ్వాసం : మంత్రి పువ్వాడ..
-తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాల్లో అమలు కావాలంటే కేసీఆర్ తోనే సాధ్యం మనే నమ్మకం
-బీఆర్ యస్ జాతీయ పార్టీ గా విజయఢంకా మోగించటం ఖాయం
-దేశాన్ని అమ్మే ప్రధాని కాదు దేశానికి కావాల్సింది.
-దేశ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలి

దసరా పర్వదినాన కేసీఆర్ ప్రకటించిన జాతీయపార్టీ బీఆర్ యస్ వైపు దేశప్రజలు చూస్తున్నారని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.గురువారం ఖమ్మం లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలంగాణాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాల్లో కూడా అమలు కావాలంటే కేసీఆర్ లాంటి సమర్ధుడైన నాయకుడు దేశానికి అవసరమని అనేక పార్టీలు కోరుకుంటున్నామని అన్నారు. దీనికోసం కేసీఆర్ దేశవ్యాపితంగా పర్యటించి దేశంలో ప్రజలు ,ప్రధానంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యనం చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న వనరులను వినియోగించడంలో బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు . ప్రపంచంలోనే భారత్ ను నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు . షూట్ బూటు సర్కార్ కాకుండా ప్రజల బాధలను పట్టించుకునే సర్కార్ కావాలని అందుకే కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలని అనేక రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన నిపుణులనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దేశరాజకీయాల్లోకి వస్తున్నారని పువ్వాడ పేర్కొన్నారు .

కెసిఆర్ వెంట నడిస్తే యావద్దేశాన్ని అన్నపూర్ణ దేశంగా తీర్చిదిద్దవచ్చునని రైతు రాజు అయ్యే రోజులు కెసిఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు .. బీజేపీ నాయకులు దేశ ప్రజలను తమ డొల్ల మాటలతో గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి దుయ్యబట్టారు

కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశంలో అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

మీడియా సమావేశంలో మంత్రితోపాటు ,విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , డీసీసీబీ అధ్యక్షలు కూరాకుల నాగభూషణం ., డీసీఎంస్ చైర్మన్ శేషగిరిరావు ,ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ , స్తంభాద్రి అర్బున్ డవలప్మెంట్ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , ఆర్జేసీ కృష్ణ లుపాల్గొన్నారు .

 

Related posts

యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై సైనా నెహ్వాల్ ట్వీట్… తీవ్రస్థాయిలో విమర్శలు…

Drukpadam

చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన

Ram Narayana

టీడీపీ చంద్రబాబుది కాదు …మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు ..!

Drukpadam

Leave a Comment