Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ,బీఎస్పీ చెట్టాపట్టాల్ …!

మునుగోడు ప్రచారంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం!… బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడిని కీర్తించిన రేవంత్‌!

  • మునుగోడు ప్ర‌చారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి
  • ప్ర‌వీణ్ క‌నిపించ‌డంతో ఆయ‌న‌తో చేతులు క‌లిపిన టీపీసీసీ చీఫ్‌
  • త‌మ క‌ల‌యిక యాదృచ్ఛిక‌మేన‌ని వ్యాఖ్య‌

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నా ఉపఎన్నికల్లో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోటీలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. మాటలు తూటాల్లాగా పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ , బీఎస్పీ నేతలు అనుకోకుండా కలుసుకొని చెట్టపట్టాలు వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఇద్దరు ఒకచోట కలుసుకొని మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.ఇది యాదృచ్చికమే అని చెపుతున్నప్పటికీ , కాంగ్రెస్ , బీఎస్పీ నేతలు చేతులు కలిపారని ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ‌లో ఆస‌క్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌ల‌మున‌క‌లై ఉన్నాయి. అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీల‌తో పాటు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా ఈ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. 3 ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల విధానాల‌ను విమ‌ర్శిస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అన్ని పార్టీలూ బూర్జువా విధానాల‌నే అవలంబిస్తున్నాయ‌ని ఆరోపిస్తున్న ఆయ‌న‌… మునుగోడులో మెజారిటీ ఓట‌ర్లు ఉన్న బీసీ వర్గానికే త‌మ పార్టీ టికెట్ ఇచ్చామ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో మంగ‌ళవారం మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్ర‌వీణ్ కుమార్ తార‌స‌ప‌డ్డారు. ఈ సందర్భంగా ప్ర‌వీణ్ కుమార్‌తో చేయి క‌లిపిన రేవంత్ ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

అంతేకాకుండా ప్ర‌వీణ్ కుమార్‌ను తాను క‌లిసిన విష‌యాన్ని కూడా ఆయ‌నే వెల్ల‌డించారు. త‌మ క‌ల‌యిక యాదృచ్ఛికమేన‌న్న రేవంత్‌… సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరమ‌ని వ్యాఖ్యానించారు‌. ప్ర‌వీణ్ కుమార్‌ను క‌ల‌వ‌డం త‌న‌కు సంతృప్తినిచ్చింద‌ని కూడా రేవంత్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Related posts

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. గవర్నర్ ఆమోదం…

Drukpadam

బీజేపీలోకి సినీ నటి జయసుధ..?

Ram Narayana

అభివృద్ధి అంటే అబద్దాలు కాదు …అసెంబ్లీ లో సీఎం జగన్ అద్భుత ప్రసంగం …

Drukpadam

Leave a Comment