Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో హోరెత్తుతున్న డాక్టర్ సీతక్క ప్రచారం …

మునుగోడులో హోరెత్తుతున్న డాక్టర్ సీతక్క ప్రచారం …
-డ‌ప్పు కొట్టి ద‌రువేసిన ఎమ్మెల్యే సీత‌క్క‌…
-నాంప‌ల్లి మండ‌లంలో ప్ర‌చారం చేసిన సీత‌క్క‌
-డ‌ప్పు క‌ళాకారుల‌తో ఉత్సాహంగా ద‌రువేసిన వైనం
-ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి

మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయా పార్టీల నేత‌లు ఉత్సాహంగా సాగుతున్నారు. త‌మ త‌మ పార్టీల‌కే ఓటేయాలంటూ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు త‌మ‌దైన శైలి వినూత్న చ‌ర్య‌లతో ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీత‌క్క డ‌ప్పు క‌ళాకారుల‌తో క‌లిసి డ‌ప్పు కొట్టి మ‌రీ ద‌రువేశారు.ఇటీవలనే పీహెడీ పొందిన ఎమ్మెల్యే సీతక్క డాక్టర్ సీతక్క అయ్యారు. ఆమె ఏది చేసిన వైరైటీగా ఉంటుంది. దీంతో ఆమె మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరుపున ప్రచారణానికి ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణ చూసి వైరి పార్టీల నేతలు బెంబేలు ఎత్తుతున్నారు .దటీస్ సీతక్క అంటున్నారు .అన్ని ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతానికి ప్రచారానికి రావాలని కోరుకుంటున్నారు.

మునుగోడులోని నాంప‌ల్లి మండ‌లంలో శ‌నివారం సీత‌క్క‌ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డ‌ప్పు క‌ళాకారుల విజ్ఞ‌ప్తి మేర‌కు భుజానికి డ‌ప్పు త‌గిలించుకుని మ‌రీ…డ‌ప్పు క‌ళాకారుల‌తో డ‌ప్పు వాయిస్తూ… డ‌ప్పు చ‌ప్పుళ్ల‌కు ద‌రువు వేశారు. అనంత‌రం మండ‌ల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లిన సీత‌క్క‌… ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి స్ర‌వంతిని గెలిపించాల‌ని ఓట‌ర్లను అభ్య‌ర్థించారు.

Related posts

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి: జనసేన

Drukpadam

పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం: వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!

Drukpadam

కొడాలి నాని వ్యాఖ్యలపై గుడివాడలో ఉద్రిక్తత…

Drukpadam

Leave a Comment