Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇలా చేస్తే మరింత ఎక్కువ లగేజీని తీసుకెళ్లొచ్చు.. 

ఇలా చేస్తే మరింత ఎక్కువ లగేజీని తీసుకెళ్లొచ్చు.. 

  • వ్యాక్యూమ్ క్లీనర్ సాయంతో కవర్ లో బ్లాంకెట్ ను ప్యాక్ చేసిన మహిళ
  • ఉన్న పరిమాణంలో సగానికి తగ్గిపోయిన బ్లాంకెట్
  • ఇదేదో బాగుందంటూ నెటిజన్ల కామెంట్లు
  • ‘మళ్లీ తిరిగొచ్చేప్పుడు ప్యాకింగ్ కోసం వ్యాక్యూమ్ క్లీనర్ నూ వెంట తీసుకెళ్లాలా?’ అంటూ కొందరి ప్రశ్నలు
ఎటైనా ఊరికి బయలు దేరామంటే.. బట్టలు సర్దాల్సిందే. ఇక తీర్థయాత్రలో, విహార యాత్రలకో అయితే పక్కబట్టల నుంచి మందుల దాకా ఎన్నో అవసరం. ఇది అవసరం, అది అవసరం అంటూ అన్నీ ఒక్కచోట చేర్చి చూస్తే.. వామ్మో ఇంత లగేజీయా అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రయాణాల్లో అలా భారీగా సంచులు పట్టుకుని వెళ్లే వాళ్లను చూసే ఉంటాం కూడా. అయితే తాజాగా లగేజీ ప్యాకింగ్ కోసం ఓ మహిళ చేసిన వినూత్న ప్రయత్నం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వ్యాక్యూమ్ క్లీనర్ సాయంతో..

ఓ మహిళ బ్లాంకెట్లను ప్యాకింగ్ చేస్తుండటం ఈ వీడియోలో ఉంది. ఓ కవర్ లో బ్లాంకెట్ ను పెట్టి.. దానికి వ్యాక్యూమ్ క్లీనర్ పైపు అనుసంధానించింది. వ్యాక్యూమ్ క్లీనర్ ను ఆన్ చేయగానే కవర్ లోని గాలిని పీల్చేయడంతో.. ఆ కవర్ బ్లాంకెట్ సహా దగ్గరికి కుచించుకుపోయింది. దాని అసలు సైజులో సగానికి వచ్చేసింది.

  • శుభాంకర్‌ మిశ్రా అనే జర్నలిస్టు ట్విట్టర్‌ లో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా లక్షకుపైగా వ్యూస్‌, నాలుగున్నర వేలకుపైగా లైకులు వచ్చాయి. ‘‘ఎక్కువగా సామగ్రి తీసుకెళ్లాలనుకునే వారికి ఈ టెక్నిక్‌ చాలా బాగా ఉపకరిస్తుంది..’’ అని ఆయన ఈ వీడియోకు క్యాప్షన్‌ కూడా పెట్టారు.
  • ఈ మహిళ చూపించిన ఆలోచన చాలా బాగుందని నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తామూ అలా ప్రయత్నించేస్తామని కొందరు పేర్కొంటున్నారు.
  • అయితే ‘‘అంతా బాగానే ఉందిగానీ.. మరి మన వెంట వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ను కూడా తీసుకెళ్లాలా? ఎందుకంటే మనం వెళ్లిన చోట సామగ్రిని ఓపెన్‌ చేస్తాం. తిరిగి తీసుకురావాలంటే.. సైజు పెరిగిపోతుంది కదా. అక్కడా గాలి తీసేస్తేనే మళ్లీ చిన్నగా ప్యాక్‌ చేయగలం కదా..’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘‘ఇది నిజమే. ఆ ఆలోచనే మాకు తట్టలేదు..’’ అంటూ కొందరు దీనిని సమర్థిస్తున్నారు కూడా.
  • ఇక ‘‘వ్యాక్యూమ్‌ ప్యాకింగ్‌ ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలాకాలం నుంచి ఉన్నదేలే’’ అని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. ‘‘అసలు ప్రయాణాల్లో వీలైనంత తక్కువ లగేజీ తీసుకెళ్లడమే మంచిది. కుక్కికుక్కి తీసుకెళ్లడం ఎందుకు?’’ అని మరికొందరు అంటున్నారు.

Related posts

షర్మిల, సునీతపై జగన్ ఫైర్…!

Ram Narayana

బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు….

Drukpadam

భారత్ నుంచి ఉక్రెయిన్ రాయబారిని వెనక్కి పిలిపించిన జెలెన్ స్కీ!

Drukpadam

Leave a Comment