Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానిదే పట్టు ..నిరూపించిన అధ్యక్ష ఎన్నిక!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం…ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: శశిథరూర్ ఆరోపణ…
ఉత్తర్ ప్రదేశ్ లో రిగ్గింగ్ కు పాల్పడ్డారన్న థరూర్
శశి థరూర్ పై ఘన విజయం సాధించిన ఖర్గే
ఖర్గేకు 7,897 ఓట్లు.. థరూర్ కి 1,072 ఓట్లు
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తి

కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానిదే పట్టు అని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు నిరూపించాయి. 24 సంవత్సరాల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎక్కేరు . అయితే మల్లిఖార్జున ఖర్గే పై తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీచేసినప్పటికీ గాంధీ కుటంబం ఆశీస్సులు ఖర్గేకి ఉండటంతో ఆయన ఘన విజయం సాధించారు . మొత్తం 9385 ఉండగా చెల్లకపోవడంగాని లేక పోల్ కాకపోవడంగాని 416 ఓట్లు ఉన్నాయి.అందులో ఖర్గే కు 7897 రాగా, థరూర్ కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. అంటే 6825 మెజార్టీతో ఖర్గే ఘన విజయం సాధించారు . ఖర్గే గాంధీ కుటంబం అండదండలు ఉండబట్టే అంత పెద్ద మెజార్టీ వచ్చిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపొందారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్ పై ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా… థరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తి చేపట్టనుండటం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో గెలిపొందిన ఖర్గేకు కాంగ్రెస్ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్గేకు శశి థరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని అన్నారు.

ఖర్గే వయసు 80 ఏళ్లు. కర్ణాటకలోని బీదర్ జిల్లా భల్కి తాలూకా వరావట్టి గ్రామంలో (అప్పట్లో నిజాం సంస్థానం) 1942లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య రాధా బాయి, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఖర్గే బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆ పార్టీ నేత, అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయని చెప్పారు. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీని కోరారు. ఈ విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు శశిథరూర్ తెలిపారు. మిస్త్రీ కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్లు శశిథరూర్ తరఫున ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ సజ్ పేర్కొన్నారు. పోలింగ్ లో జరిగిన అవకతవకలపై మిస్త్రీ నోటీసుకు తీసుకెళ్లినట్లు వివరించారు.

Related posts

24 గంటల్లో మీ పదవులు పోతాయి… షిండే వర్గంలోని మంత్రులకు శివసేన వార్నింగ్!

Drukpadam

లోకేష్ జూమ్ మీటింగ్ కు వైసీపీ బ్రేక్ …

Drukpadam

బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రుషీ సూనక్​…

Drukpadam

Leave a Comment