Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇంతకీ టీఆర్ యస్ నుంచి ఖమ్మం మేయర్ ఎవరు ?

ఇంతకీ టీఆర్ యస్ నుంచి ఖమ్మం మేయర్ ఎవరు ?
-మహిళా రిజర్వేడ్ కావడంతో ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది.
-మంత్రి మదిలో ఎవరున్నారు.
-సీల్డ్ కవర్ వస్తుందా ? మంత్రి నిర్ణయమే ఫైనలా ?
-ఖమ్మం లో టీఆర్ యస్ అగ్రనేతల ప్రచారం ఉంటుందా ?
ఖమ్మం నగర కార్పొరేషన్ కు ఈ నెల 30 తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఖమ్మం కార్పొరేషన్ ను జనరల్ మహిళకు కేటాయించారు. గత కార్పొరేషన్ లో ఎస్టీ జనరల్ కు మేయర్ పీఠాన్ని కేటాయించారు. ఈ సారి రిజర్వేషన్ మారింది. అందువల్ల మహిళలలో ఎవరైనా మేయర్ గా ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. అయితే జనరల్ మహిళా అనగానే ఓ సి మహిళకే
కేటాయించేందుకు అవకాశాలు ఉన్నాయి. మంత్రి మదిలో కూడా ఓ సి మహిళలకే ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కేసీఆర్ ,కేటీఆర్ ఆమోదం తీసుకున్నాకనే మంత్రి మేయర్ ను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓసీలలో సైతం అనేక మంది మహిళలు పోటీలో ఉన్నారు. వారిలో మేయర్ పీఠం ఎవరికీ దక్కనున్నది అనేది చర్చనీయంశంగా ఉంది . ఖమ్మం కార్పొరేషన్ టీఆర్ యస్ గెలిచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలే ఉన్నాయి. కాంగ్రెస్ ,సిపిఎం సైతం కలిసి పోటీచేస్తూ కొన్ని డివిజన్లలో అధికార టీఆర్ యస్ పార్టీకి సవాల్ విసురుతున్న మేయర్ పీఠం దక్కించుకోగలిగేంత సీట్లు గెలుస్తారా ? అనే సందేహాలు ఉన్నాయి. గతంలో ఉన్న అనేక మంది కార్పొరేటర్ల డివిజన్లు పునర్విభజనలో తారుమారు అయ్యాయి. దీనితో వారు పోటీచేసేందుకు అవకాశం లేనప్పటికీ వారి భార్యలకు లేదా బందువులకు టిక్కెట్లు ఇచ్చారు. టిక్కెట్లు కోల్పోయిన వారిలో తోట రామారావు , పగడాల నాగరాజు , చావా నారాయణ రావు , లాంటి వారికీ వారి భార్యలకు టికెట్స్ ఇచ్చారు. దీంతో అసమ్మతి లేకుండా చల్లార్చగలిగారు .
మేయర్ పీఠం ఎవరికీ దక్కనున్నదనే ఆశక్తి నెలకొన్నది . తొలుత మంత్రి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి 20 డివిజన్ నుంచి పోటీచేసి మేయర్ అవుతారని ప్రచారం జరిగింది. అందుకనుగుణంగానే ఆమె 20 డివిజన్ నుంచి నామినేషన్ వేశారు.ఇంకేముంది ఆమె మేయర్ అనే ప్రచారానికి బలం చేకూరింది . కాని మంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన భార్య మేయర్ బరిలో లేరని అసలు ఆమె పోటీ కూడా చేయటం లేదని ప్రకటించారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. మమతా కాలేజీ ఓటర్లు ఉన్న 20 డివిజన్ నుంచి మేడా ప్రశాంత లక్మి ని మంత్రి పోటీలో నిలిపి అక్కడ నుంచి తన భార్య వేసిన నామినేషన్ ఉపసంహరింప జేశారు. గతంలో
మేడా ప్రశాంత లక్ష్మి 11 వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. పునర్విభజనలో అది మూడు డివిజన్లుగా విడిపోవింది . తొలుత 21 నుంచి మేడా ప్రశాంత లక్ష్మి నామినేషన్ వేయించిన మంత్రి , ఆమె ను అక్కడ ఉపసంహరింపజేసి 20 డివిజన్ నుంచి వేయమన్నారు. ఆళ్ల శిరీష ను 21 డివిజన్ నుంచి పోటీకి పెట్టారు. ఆమె వాస్తవంగా గతంలో ధంసలాపురం నుంచి ఎన్నికైయ్యారు. ఈ సారి ఆ డివిజన్ బి సి జనరల్ కు రిజర్వ్ అయింది. అందువల్ల ఆమె అక్కడ పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమెను 21 వ డివిజన్ కు మార్చారు. ఇప్పుడు టీఆర్ యస్ నుంచి ఇంతకీ మేయర్ అభ్యర్థి ఎవరు ? మంత్రి మదిలో ఎవరు ఉన్నారు అనేది ఆశక్తి నెలకొన్నది . అనేక మంది మేయర్ పదవి ఆశిస్తున్నా ప్రధానంగా ఆరుగురిలో ఒకరికి దక్కే ఆవకాశం ఉందని అంటున్నారు. వారిలో 20 డివిజన్ పోటీలో ఉన్న మేడా ప్రశాంత లక్ష్మి , 26 డివిజన్ నుంచి పోటీలో ఉన్న పూనుకొల్లు నీరజ , 10 డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన చావా మాధురి , 54 డివిజన్ నుంచి పోటీ చేస్తున్న పోట్ల శ్రీదేవి, 55 డివిజన్ నుంచి పోటీచేస్తున్న పోట్ల శశికళ , 13 డివిజన్ నుంచి పోటీలో ఉన్న కొత్తపల్లి నీరజ లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి.
మొత్తం మీద సీట్ల కేటాయింపులో ఎలాంటి అలకలు లేకుండా మంత్రి జాగ్రత్త పడ్డారు. టిక్కెట్ల కేటాయింపులో మొఖమాటాలకు , బందు ప్రీతికి తావు ఇవ్వలేదు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు. కొంత మంది మాజీ కార్పొరేటర్ల డివిజన్లలో మార్పులు జరిగినా, వారిని సైతం ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేశారు. ఇక ప్రచారం , గెలిపించే భాద్యతను ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి అజయ్ మీదనే పెట్టారు. అందుకే వరంగల్ లో టీఆర్ యస్ అభ్యర్థుల ఎంపికలో కొన్ని ఇబ్బందులు ఉన్న ఖమ్మం లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ప్రచారానికి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి రాలేదు. అయితే నిన్న మొన్నటి నుంచి ఎంపీ నామ ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి , మాజీ ఎంపీ లు కూడా ప్రచారంలో పాల్గొంటారని మంత్రి అజయ్ తెలిపారు. దీంతో వారు దూరంగా ఉంటున్నారని ప్రచారానికి కూడా మంత్రి తెరదించారు. ఇక 60 కి 60 డివిజన్లు తమ ఖాతాలో పడతాయని టీఆర్ యస్ చెబుతున్న కాంగ్రెస్ , సిపిఎం కూటమి గట్టి పోటీ ఇస్తుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కరోనా నేపథ్యంలో ప్రచార సమయాన్ని కుదించడంతో అభ్యర్థులు ఇంటింట ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Related posts

కొన్ని రోజులపాటు కలిసి ఉన్నంత మాత్రాన అది సహజీవనం అనిపించుకోదు: పంజాబ్, హర్యానా హైకోర్టు!

Drukpadam

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

Drukpadam

దటీస్ జగన్ … అప్పుడు లీగల్ సమస్యతో పదవి కోల్పోయిన జస్టిస్ కానగరాజ్ కు పదవి…

Drukpadam

Leave a Comment