Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అయోధ్యలో 15 లక్షల ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డు!

అయోధ్యలో 15 లక్షల ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డు!
-దీపోత్సవ్ సందర్భంగా 15.76 లక్షల ప్రమిదలు వెలిగించిన 22 వేల
మంది వాలంటీర్లు
-దీపోత్సవానికి హాజరై శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
-లేజర్ షో, బాణా సంచా వెలుగులతో మెరిపోయిన ఆయోధ్య నగరం

అయోధ్య నగరంలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్ సంబరాలు అంబరాన్ని తాకాయి. అదివారం రాత్రి సరయు నది తీరంలో రామ్ కి పైడి వద్ద 15 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్ అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన 22 మంది వాలంటీర్లు 15 లక్షల 76 వేల ప్రమిదలు వెలిగించి గిన్నిస్ రికార్డులో భాగం అయ్యారు. ఈ దీపోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఆయోధ్యలో రాముడిని దర్శించుకున్న మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రామ మందిరం కోసం భూమి పూజ చేసిన శ్రీరామలయాల్లోను పూజలు చేసిన మోదీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ పనులను సమీక్షించారు. అనంతరం శ్రీరాముడి లాంఛనప్రాయ పట్టాభిషేకంలో పాల్గొని సీతారాముళ్లకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో కార్యక్రమాలు జరిగాయి. ప్రమిదల వెలుగు, విద్యుత్ కాంతులతో అయోధ్య వీధులన్నీ వెలిగిపోయాయి.

Related posts

మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం మృతి

Drukpadam

ఖబడ్దార్.. చేతులు ముడుచుకుని కూర్చోలేదు.. భువనేశ్వరిపై కామెంట్లపట్ల వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్

Drukpadam

ఉక్రెయిన్ లో కీలక నగరాన్ని కోల్పోయిన రష్యా!

Drukpadam

Leave a Comment