Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పంచదార స్థానంలో బెల్లం వాడుకోవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?

పంచదార స్థానంలో బెల్లం వాడుకోవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?

  • పంచదారను పూర్తిగా మానేయక్కర్లేదు
  • టీ, కాఫీ, శర్బత్ రూపంలో తీసుకోవచ్చు
  • పంచదారకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు
  • చలికాలంలో బెల్లం అనుకూలం

‘‘పంచదార మంచిది కాదు, ఎంతో హాని చేస్తుంది. దీనికి బదులు బెల్లం వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది’’అంటూ సలహాలు ఇస్తుండడం మనలో చాలా మంది వినే ఉంటారు. మరి ఇందులో వాస్తవం పాళ్లు ఎంత? పంచదారను పూర్తిగా విడిచి పెట్టాలా? బెల్లం మంచిదేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

పంచదార లేదా షుగర్ లేదా చక్కెర అనేది రిఫైన్డ్ చేసినది. కానీ, బెల్లం లేదా జాగరీ అన్నది చెరకు రసంతో చేసిన అన్ రిఫైన్డ్ పదార్థం. అందుకే దీన్ని నాన్ సెంట్రీఫూగల్ కేన్ షుగర్ అంటారు. వీటిని ఏ కాలంలో వాడుకుంటున్నాం? అన్నది ముఖ్యమంటున్నారు న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. ‘‘శీతాకాలంలో అయితే బెల్లం మంచిది. సజ్జలు లేదా నువ్వులతో దీన్ని కలిపి తీసుకోవచ్చు. వేసవిలో అయితే శర్బత్, శ్రీఖండ్ లేదా ఇతర పదార్థాల్లోకి పంచదార మంచి ఆప్షన్’’అని వివరించారు.

ఓ వ్యక్తి రోజువారీ జీవనం నుంచి చక్కెరను తొలగించాలా? అంటే.. పంచదారకు బెల్లం ప్రత్యామ్నాయం కాదంటున్నారు దివేకర్. ఇంట్లో తయారు చేసుకునే మిఠాయిలు అయితే బెల్లం వాడుకోవచ్చని సూచిస్తున్నారు. చక్కెర ఏ రూపంలో తీసుకుంటున్నామనేది మన ఆరోగ్య పరంగా ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లో చక్కెర అయితే చాలా హాని కనుక వీటికి పూర్తి దూరంగా ఉండాలన్నది ఆమె సూచన. టీ, కాఫీ, ఇంట్లో మిఠాయిల్లోకి అయితే చక్కెరను దూరం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు.

చక్కెర పట్ల భయం కల్పించడం అన్నది కూడా ఆహార పరిశ్రమ వ్యాపార కోణాల్లో ఒకటిగా ఆమె పేర్కొనడం గమనార్హం. బెల్లంలో పోషకాలు ఎక్కువ. ఐరన్, క్యాల్షియం, పొటాషియాం, మెగ్నీషియం లభిస్తాయి. అందుకే చక్కెర బదులు బెల్లం మంచిదంటారు. మధుమేహం ఉన్న వారికి చక్కెర, బెల్లం రెండూ మంచివి కావు. ఏది తీసుకున్నా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది.

Related posts

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత…అపోలో వైద్యుల ప్రకటన విడుదల!

Drukpadam

బిగ్ బాస్ రియాలిటీ షో ? ఎక్కడో లెక్క తప్పుతుంది…

Drukpadam

విమానంలో వెకిలి చేష్టలు-విజయవాడ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి అరెస్ట్

Drukpadam

Leave a Comment