Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఐడీకి షాక్…అయ్యన్న రిమాండ్ కు విశాఖ కోర్టు తిరస్కరణ!

ఏపీ సీఐడీకి షాక్…అయ్యన్న రిమాండ్ కు విశాఖ కోర్టు తిరస్కరణ!

  • 2 సెంట్ల భూమిని ఆక్రమించారంటూ అయ్యన్నపై కేసు
  • అయ్యన్నతో పాటు ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
  • నిందితులను విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచిన వైనం
  • ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదన్న కోర్టు
  • అయ్యన్న, రాజేశ్ లకు బెయిల్ మంజూరు చేసిన వైనం
  • నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీకి ఆదేశం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులకు గురువారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసులో అయ్యన్నతో పాటు రాజేశ్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఈ కేసులో సీఐడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టవచ్చంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేయడంతో పాటు నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.

Related posts

ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!

Drukpadam

హిజాబ్ మత ఆచారం కాదు..: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Drukpadam

ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్న యోగి ఆదిత్యనాథ్!

Drukpadam

Leave a Comment