Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

 కొవిడ్‌ విజృంభణ..అయినా బెంగాల్ లో 75 శాతం పోలింగు…

కొవిడ్‌ విజృంభణ..అయినా బెంగాల్ లో 75 శాతం పోలింగు…
మండుతున్న సూర్యుడు ,కరోనాను సైతం లెక్క చేయని బెంగాల్‌ ఓటర్లు!
-నేడు 34 అసెంబ్లీ స్థానాల్లో ఏడో విడత పోలింగ్‌
-కరోనా బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు
– భవానిపురలో ఓటు హక్కు వినియోగించుకున్న దీదీ
-ఇప్పటి వరకు 259 స్థానాల్లో పోలింగ్‌ పూర్తి
-మరో 35 స్థానాలకు 29న ఆఖరి విడత పోలింగ్‌
ఓవైపు కొవిడ్‌ విజృంభణ.. మరోవైపు భగభగ మండే సూర్యుడు , ఎండ తీవ్రత.. ఇవేవీ బెంగాల్‌ ఓటర్లను ఆపలేకపోయాయి. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు జరిగిన ఏడో విడత పోలింగ్‌లో 75.06 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. ఇక్కడ త్రిముఖ పోటీ జారుతున్న ప్రధాన పోటీ టీఎంసీ , బీజేపీ మధ్యనే ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి.హోరాహోరీ జరిగిన ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ , హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డా ప్రచారంలో పాల్గొన్నారు.గతంలో ఏ ఎన్నికల్లో కన్నా బెంగాల్ ప్రచారంలో మోడీ పలు సభల్లో పాల్గొన్నారు.మమతా బెనర్జీ పై పలు ఆరోపణలు చేశారు.అసలు బెంగాల్ లో 8 విడతల పోలింగ్ పెట్టడం పైనే అనేక విమర్శలు ఉన్నాయి.ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే చేస్తుందని మమతా ఆరోపించాడు.చివరిలో కరోనా విజృభిస్తున్న వేళ ఎన్నికల ను ఒకే విడత జరిపాలనే మమతా డిమాండ్ ను సైతం ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. 26 వ తేదీన 34 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 7 విడతలు పూర్తీ అయ్యాయి.మరో విడత మాత్రమే మిగిలి ఉంది .చివరగా 29 తేదీన 8 విడత ఎన్నికలు జరగనున్నాయి.తుది విడతలో 35 నియోజవర్గాలలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. మే 2 వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. బెంగాల్ లో అన్ని విడతల్లో పోలింగ్ శాతం తగ్గలేదు . అందువల్ల అనూహ్య ఫలితాలు వచ్చే ఆవకాశం ఉండ వచ్చుననే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

మొత్తం ఐదు జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ముర్షీదాబాద్‌ జిల్లాలో అత్యధికంగా సాయంత్రం ఐదు గంటల వరకే 80.07 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 268 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా బాధితులు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరి గంట పోలింగ్‌ ప్రత్యేకంగా వారి కోసమే కేటాయించారు.
తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకుగానూ మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటివరకు పూర్తయిన ఏడు విడతల్లో మొత్తం 259 స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది. ఇక ఏప్రిల్‌ 29న జరిగే చివరి విడతలో 35 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Related posts

5 Easy Tips On How To Plan A Balanced Diet For Glowing Skin

Drukpadam

వీధి ఒకటే.. నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు.. ఏపీలో వింత!

Drukpadam

గుండెపోటుతో బస్సులో చనిపోయిన ప్రయాణికుడు.. మృతదేహాన్ని అదే బస్సులో ఇంటికి చేర్చిన డ్రైవర్

Drukpadam

Leave a Comment