Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సంచలనం ….70 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం …?

సంచలనం ….70 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం …?
-తెలుగు రాష్ట్రాల్లో కలకలం …ఇంతకు ముందే చెప్పిన కేసీఆర్
-సిట్ దర్యాప్తులో వెల్లడయిందంటూ నమస్తే తెలంగాణలో కథనం
-జగన్ ను కౌగిలించుకుంటూనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్న వైనం
-70 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నిస్తున్నారని వెల్లడి

టీఆర్ యస్ ఎమ్మెల్యేల కొనుగోలు దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయాన్నీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పారు . ఇది నిందితులు సైతం అంగీకరించారని వెల్లడి కావడం విశేషం .జగన్ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తున్న నమ్మకద్రోహం చేసేందుకు మోడీ ప్రయత్నం చేయడం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని నమస్తే తెలంగాణ పత్రికలో ఒక కథనం వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ఇది వెల్లడయిందని తెలిపింది. తెలంగాణ మాదిరే మరో మూడు రాష్ట్రాల్లో ఇదే తరహా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. ఏపీ సీఎం జగన్ తో మోదీ స్నేహపూర్వకంగా ఉంటూనే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చందుకు ప్రయత్నాలను మొదలు పెట్టారని తెలిపింది. సిట్ దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసిందని వెల్లడించింది. వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని… వీరిలో 55 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లాబీయిస్టులకు టచ్ లోకి వెళ్లారని పేర్కొంది. జగన్ ను ఆప్యాయంగా కౌగిలించుకుంటూనే… ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం ఉందని తెలిపింది.

Related posts

ఏపీ సీఎం జగన్ ను ఎమ్మెల్యే రోజా కాకాపడుతున్నారా ?

Drukpadam

ఢిల్లీలోబీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల తొలగింపు!

Drukpadam

బొత్స సంగతి సరే… చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు?: పేర్ని నాని!

Drukpadam

Leave a Comment