Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు:ఈటలకు డిప్యూటీ సీఎం… టీఆర్ యస్ ఆఫర్ చేసిందంటూ కథనాలు …

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు:ఈటలకు డిప్యూటీ సీఎం… టీఆర్ యస్ ఆఫర్ చేసిందంటూ కథనాలు …
-రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ …
-మాజీలను చేరదీసేందుకు టీఆర్ యస్ వ్యూహాత్మక అడుగులు వేస్తుందా
-బీజేపీతో తేడా పేడో అంటున్న గులాబీ బాస్
-హుటాహుటిన మేల్కొన్న బీజేపీ హైకమెండ్
-ఈటల, కోమటిరెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు
-అమిత్ షాతో భేటీ కానున్న ఈటల, కోమటిరెడ్డి
-ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డీకే అరుణ

టీఆర్ యస్ నుంచి బీజేపీ లో చేరి హుజారాబాద్ లో తిరిగి గెలిచినా బీసీ నేత ఈటల రాజేందర్ ను తిరిగి టీఆర్ యస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది .దీనిపై రాజకీయపరిశీలకు సీనియర్ నేతలు నిశిత పరిశీలన చేస్తున్నారు . రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చునని అంటున్నారు . అంతేకాకుండా ఆయనకు తిరిగి టీఆర్ యస్ లో చేరితే డిప్యూటీ సీఎం ఇస్తామని టీఆర్ యస్ ఆఫర్ చేసిందని ఒక ఆంగ్ల పత్రిక బ్యానర్ కథనం ..దీంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు బయలు దేరాయి. ఇందులో నిజమెంత అనేదానిపై రాజకీయవర్గాలు చర్చోపచర్చలు చేస్తున్నాయి. దీనిపై అలర్ట్ అయినా బీజేపీ అధిష్టానం హుటాహుటిన ఢిల్లీకి రావాలని ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు కబురు చేసింది. వారు ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసేందుకు బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు . పత్రిక కథనాలపై ఇప్పటికే బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు సమాచారం .

ఢిల్లీలో వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి ఓటమిపాలయినప్పటికీ బీజేపీకి భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 96,598 ఓట్లు రాగా… కోమటిరెడ్డికి 86,485 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నాయి.

ఈనేపథ్యంలో టీఆర్ యస్ రాజకీయ గేమ్ కు ప్రతిగా ఎత్తులు వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తిరిగి ఈటల రాజేందర్ టీఆర్ యస్ లో చేరి డిప్యూటీ సీఎం అయితే దాని ప్రభావం బీజేపీ తెలంగాణ పార్టీపై ఉంటుందని అందువల్ల దాన్ని నివారించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ద్రుష్టి సారించింది.ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డీకే అరుణ కూడా అమిత్ షా తో జరిగే భేటీలో పాల్గొంటారని తెలుస్తుంది.

బీజేపీలో చేరేంతవరకు అక్కున చేర్చుకొని ఆతర్వాత పట్టించుకోకపోవడం పై ఆపార్టీలో చేరిన పలువురు మదన పడుతున్నారు .టీఆర్ యస్ పై కోపంతో చేరిన స్వామిగౌడ్ , కాంగ్రెస్ వీడిన దాసోజు శ్రావణ్, పరిస్థితి చూశామని అంటున్నారు .అందువల్లనే వారు బీజేపీని వీడి తిరిగి టీఆర్ యస్ లోచేరినట్లు చెబుతున్నారు . అనేకమంది ఇతర పార్టీలనుంచి బీజేపీ లో చేరిన తర్వాత బీజేపీ నేతలు వీరు ఫోన్లు చేసిన ఎత్తారనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఎదురు పడ్డ పలకరింపులు ఉండవని అందువల్ల బీజేపీ లో చేరిన వారు పునరాలోచలనో పడ్డారనే జరుగుతున్నా ప్రచారం నేపథ్యంలో బీజేపీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది … అవి ఎంతవరకు ఫలప్రదం అవుతాయో చూద్దాం ….

 

Related posts

లోకేష్ పాదయాత్రపై టీడీపీ గంపెడు ఆశలు …

Drukpadam

నల్లగొండ జిల్లా లో వైఎస్‌ ష‌ర్మిల‌ నిరుద్యోగ దీక్ష‌…

Drukpadam

ఏపీ లో ఎస్ ఐ కి మంత్రి వార్నింగ్ కలకలం …. దుమారం రేపుతున్న వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment