Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముచ్చటలేదు .. కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముచ్చటలేదు .. కేసీఆర్
-మళ్ళీ మనదే అధికారం …షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
-సిట్టింగులను మార్చే ప్రసక్తే లేదని వెల్లడి
-ఎమ్మెల్యేల గెలుపు భాద్యత మంత్రులదే
-అనవసర విషయాల జోలికి వెళ్లరాదని పార్టీ నేతలకు సూచన
-నా కుమార్తెనే పార్టీ మారమని బీజేపీ అడిగిందన్నకేసీఆర్
-ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్
-విపక్షాల ఎదురు దాడులను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
-సమావేశంలో జగన్ ప్రస్తావన.. వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర అన్న కేసీఆర్
-జగన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారన్న కేసీఆర్
-ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని ధ్వజం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. ఆముచ్చటేలేదని స్పష్టం చేశారు . ఈ మేరకు మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని కూడా ఆయన వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో పాత వారికే సీట్లు కేటాయిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు, పార్టీ కీలక నేతలతో కలిసి మంగళవారం కేసీఆర్ ఓ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. నేతలంతా పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయాలని సూచించారు. అనవసర విషయాల జోలికి వెళ్లరాదన్నారు. ఐటీ, ఈడీ దాడులతో విరుచుకుపడుతున్న బీజేపీపై పోరాటం కొనసాగించాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీతో ఇక యుద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు.

టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించిన కేసీఆర్… బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు స్వయంగా తన కుమార్తె కవితనే పార్టీ మారాలంటూ అడిగారన్న కేసీఆర్… ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో బీజేపీ నేతల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విరుచుకుపడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ చేయించే ఈ దాడులను తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందన్న కేసీఆర్… ఆ దాడులను తిప్పికొట్టే దిశగా నేతలు సిద్ధం కావాలని సూచించారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుపై ఈ సమావేశంలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను వివరించే క్రమంలో కేసీఆర్… ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను కూడా ప్రస్తావించారు.

ఈ సందర్భంగానే వైసీపీని, జగన్ ల ప్రస్తావనను కేసీఆర్ తీసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ సీఎం జగన్ అనుకూలంగానే ఉంటున్నారని కేసీఆర్ అన్నారు. ఓ వైపు తమకు జగన్ అనుకూలంగా ఉన్నా ఆయన నేతృత్వంలోని వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

మేం ఎవరి రాజీనామాకు డిమాండ్ చేయలేదు: భట్టి విక్రమార్క!

Drukpadam

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన దేశపతి….!

Drukpadam

కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!

Drukpadam

Leave a Comment