Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ది అబద్దాల కంపెనీ …కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

కేసీఆర్ అబద్ధాలు చెప్పే కంపెనీ తయారుచేస్తున్నారు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి!

  • తెలంగాణ సర్కారుపై ధ్వజమెత్తిన కేంద్రమంత్రి
  • సింగరేణిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • కేసీఆర్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు
  • అబద్ధాలు మానుకోవాలంటూ కేసీఆర్ కు హెచ్చరికలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపార్టీని అబద్దాల కంపెనీ గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు . సింగరేణి సంస్థను కేంద్రం ప్రవేట్ పరం చేస్తుందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు .సింగరేణిని ప్రవేట్ పరం చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉందని ,కేంద్రం వాటా 49 శాతమని అందువల్ల చట్ట ప్రకారం ఆ కంపెనీ పై అధికారాలు రాష్ట్రానికే ఉంటాయని పేర్కొన్నారు .

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతిపాలన నడుస్తోందని విమర్శించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కంటే రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువని స్పష్టం చేశారు. సింగరేణిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని వివరించారు.

కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, అబద్ధాలు చెప్పే కంపెనీ తయారుచేస్తున్నారని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. అబద్ధాలు మానుకోవాలని కేసీఆర్ ను హెచ్చరిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు.

Related posts

జగన్ ,షర్మిల మధ్య విబేధాలు…?

Drukpadam

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!

Ram Narayana

కొనసాగుతున్న ఆఫ్ఘన్ సంక్షోభం …ప్రపంచదేశాలు సమాలోచనలు!

Drukpadam

Leave a Comment