సత్తుపల్లి సభ సాక్షిగా కలిసిన నాయకులు…కలవని మనసులు …
–తనను ఎంపీ బండి పార్థసారథి రెడ్డి పిలిచారని అందుకే వచ్చానన్న మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి
–తనకు ఆహ్వానం సరిగా అందలేదని సభకు దూరంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల …
–సత్తుపల్లిలో ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఆధ్వరంలో కేసీఆర్ కు కృతజ్ఞత సభ…
–ఖమ్మం జిల్లా నుంచి బండి పార్థసారథిరెడ్డి ,Vaddi Raju Ravi Chandra lanu రాజ్యసభ కు పంపినందుకు …. సత్తుపల్లిలో జనజాతర …
–పాల్గొన్న మంత్రి, ఎంపీలు ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు తల్లాడనుంచి ఘన స్వాగతం
సత్తుపల్లి లో టీఆర్ యస్ పార్టీ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన సభలో మనుషులు కలిశారు కానీ మనసులు కలవలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ స్తనాలు ఇచ్చినందుకు గాను సీఎం కేసీఆర్ కు సత్తుపల్లి లో ఎమ్మెల్యే వెంకటవీరయ్య ఆధ్వరంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు . ఇంతవరకు బాగానే ఉన్నా, సభకు పిలవడంతో లోపం జరిగిందని విమర్శలు వచ్చాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కార్యక్రమ నిర్వాహకుడు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వయంగా పిలవలేదని తుమ్మల దూరంగా ఉండగా , కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు సైతం ఆహ్వానం సరిగా అందలేదని ఎంపీ బండి పార్థసారథి రెడ్డి పిలిచారనే ఉద్దేశం తోనే వచ్చానని , జిల్లా నుంచి రాజ్యసభకు వెళ్లిన పార్థసారథి రెడ్డి , వద్దిరాజు రవిచంద్రలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు . అయితే శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఆయన అభిమానులు నినాదాలతో హోరెత్తించారు .
ఎప్పుడో ఏర్పాటు చేద్దామనుకున్న సభ రకరకాల కారణాల వల్లసభ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు శుక్రవారం పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు . దీనికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ యస్ ఎమ్మెల్యేలు మంత్రి పువ్వాడ అజయ్ ,ఎంపీ నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , తాతా మధు హాజరైయ్యారు . ఈ సందర్భంగా సత్తుపల్లి లో రంగ రంగ వైభవంగా భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు .మహిళల కోలాటం, బతుకమ్మ సంబరాలు ప్రదర్శనలో హైలెట్ గా నిలిచాయి. భారీ కాన్వాయ్ తో సత్తుపల్లి లో జనజాతరను తలపింప చేసింది. నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లాలో ఐక్యతగా ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించి కేసీఆర్ కు బహుమానంగా ఇవ్వాలని నాయకులు ఉద్ఘాటించారు . అందరు ఐక్యత రాగం వినిపించినా వారి మనుషులు కలిసి లేవనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి…..