Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు…

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల.. !

  • డిసెంబర్ 7 నుంచి 29 వరకు ఉభయ సభల సమావేశాలు
  • మొత్తం 17 పని దినాలు ఉంటాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
  • ఈ నెల 21 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వెల్లడించారు. డిసెంబ‌ర్ 7 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఉభయసభల స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయని చెప్పారు. ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లులు, అంశాల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్  ధన్ కర్ ఎగువ సభలో కార్యకలాపాలను నిర్వహించే మొదటి సెషన్ ఇది కావడం గమనార్హం.

కాగా, పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ నెల 21వ తేదీన ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం  నిర్వహించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమల చాంబర్లు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగం నిపుణులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం అవుతారు.

Related posts

గోదావరి వరదలపై భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam

చైనాలో 135 ఏళ్ల వయసులో కన్నుమూసిన అత్యంత పెద్ద వయస్కురాలు!

Drukpadam

గత ఏడాది భారీగా పెరిగిన ప్రపంచ జనాభా.. భారత్ జనాభా ఎంతంటే…!

Drukpadam

Leave a Comment