Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం సుందరీకరణ పై మంత్రి పువ్వాడను ప్రశంశించిన సీఎం కేసీఆర్!

ఖమ్మం సుందరీకరణ పై మంత్రి పువ్వాడను ప్రశంశించిన సీఎం కేసీఆర్!
-స్థానిక ఎమ్మెల్యే , మంత్రి పువ్వాడ కృషి అమోఘమన్న సీఎం
-ఖమ్మం వెళ్లి అక్కడ అభివృద్ధిని చూడాలని అధికారులకు ఆదేశం
-నిజామాబాద్ అభివృద్ధిపై సమీక్షలో ఖమ్మం అభివృద్ధి ప్రస్తావన
-కేసీఆర్ , కేటీఆర్ సహకారం వల్లనే ఖమ్మం అభివృద్ధి చేశామన్న పువ్వాడ
-వారికీ ఖమ్మం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నా పువ్వాడ

సీఎం కేసిఆర్, ఖమ్మం నగర అభివృద్ధి పై సీఎం కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఖమ్మం అభివృద్ధిలో పట్టువదలని విక్రమార్కుడిలా మంత్రి పువ్వాడ అజయ్ పనిచేశారని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి కేసిఆర్. పట్టణాల అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు . ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు అభివృద్ధికి అమడదూరంలో ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారిందని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన దృష్టిని కేంద్రీకరించి పని చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశంసించారు.

ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలని , ఖమ్మం టూరుకు వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని అని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించడం విశేషం .

ముఖ్యమంత్రి ప్రశంసలపై మంత్రి పువ్వాడ స్పందిస్తూ సీఎం కేసీఆర్ , మంత్రు కేటీఆర్ సహకారం వల్లనే ఖమ్మంను అభివృద్ధి చేయగలిగామని వారి సహకారం లేకుంటే అభివృద్ధి జరిగేది కాదని అన్నారు. చాలావరకు అభివృద్ధి చేసిన మరికొంత చేయాల్సిన అభివృద్ధి ఉందని అన్నారు . అభివృద్ధిలో ఖమ్మం నగరాన్ని నంబర్ వన్ గా నిలబెట్టేందుకు సహకరించిన కేసీఆర్ కు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు .

Related posts

సోనూసూద్ సేవ‌లు చేస్తోంటే ఆయ‌న‌ను భ‌య‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు: కేటీఆర్

Drukpadam

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలు …10 వేల జరిమానా!

Drukpadam

సముద్రం అడుగున శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ.. విశాఖలో అద్భుతం

Ram Narayana

Leave a Comment