ఎమ్మెల్యే వెంకటవీరయ్య నివాసాన్ని ఖాళీ చేయించేందుకు విశ్వప్రయత్నాలు!
-ఇది ముమ్మాటికీ విధాతల ,ప్రధాతల పనే అని ఎమ్మెల్యే ఆగ్రహం
-ఎన్ఎస్పీ లో అనేక ఆక్రమణలు …అయినా పట్టించుకోని అధికారులు
-వందల ఎకరాల భూములు హాంఫట్ అవుతున్న వైనం
సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య కు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు .ఆయన టీడీపీ నుంచి టీఆర్ యస్ లో చేరి లబ్ది పొందారని, కోట్లాది రూపాయలు కేసీఆర్ ఇచ్చారని ,అందుకే పార్టీ మారారని పుకార్లు షికార్లు చేశాయి.ఖమ్మంలో నివాసం ఉంటున్న ఇంటిని రెగ్యూలరైజ్ చేశారని నిందలు మోశారు. అన్నిటిని ప్రజలకోసమే భరించానని అంటుంటారు ఎమ్మెల్యే సండ్ర ..
వాస్తవం ఏమిటనే విషయాన్నీ ఆరాతీస్తే ఆయన టీఆర్ యస్ నుంచి లబ్ది పొందారనే దానిలో ఏమాత్రం నిజం లేదనేది గమనార్హం . పైగా ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందునుంచి ఖమ్మంలోని ఎన్ ఎస్పీ లోని క్వార్టార్ లో నివాసం ఉంటున్నారు . అయితే ఆయనకు కేసీఆర్ పార్టీ మారినందుకు తాను ఉంటున్న క్వార్టార్ ను రెగ్యూలరైజ్ చేశారని అపవాదు ఉంది . దీనిపై పెద్ద ఎత్తున జిల్లాలో చర్చలు కూడా జరిగాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ పార్టీ మారినందుకు ఒక ఎమ్మెల్యేకు , ఒక ఎంపీకి ఎన్ ఎస్పీ భూములు రెగ్యూలరైజ్ చేశారనే ప్రచారం ఉంది . వందల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ అవుతున్న కళ్లప్పగించి చూస్తున్న అధికారులు చిన్న గుడిశలు వేసుకుంటున్న పేదలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. పెద్దవాళ్లకు గులాంగిరి చేస్తూ వారికీ విలువైన భూములు కట్టబెడుతున్న అధికారులు పేదల నివాసాలకు స్థలాలు ఇచ్చేందుకు అడ్డుతగులుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఖమ్మం ఎన్ ఎస్ పీ లో గత రెండు దశాబ్దలకు పైగా సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి .
ఆయన నివాసాన్ని వేరే వాళ్లకు కేటాయించారని అందువల్ల ఖాళీచేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే సైతం అంగీకరించారు . ఇది ఎవరి పుణ్యమైన ఖమ్మంలో తాను నివాసం ఉండేందుకు అద్దె ఇల్లు వెతుకుంటున్నాని కూడా ఆయన చెప్పారు. దీని వెనక పెద్ద కుట్ర కోణం ఉందనేది సండ్ర అనుయాయుల అభిప్రాయం . అయితే ఇది ముమ్మాటికీ ఖమ్మం జిల్లాలో విధాతల ,ప్రధాతలగా చెప్పుకునే వారి పనేనని అభిప్రాయాలూ ఉన్నాయి . సత్తుపల్లి నియోజకర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న పనులను సైతం విధాతలు , ప్రదాతలు తాము చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని అంటున్నారు అక్కడి ప్రజలు .
అనేక మందికి వందల ఎకరాల భూములు ఉన్నా ,కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా వారి జోలికి వేళ్ళని అధికారులు తాను ఖమ్మం లో ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలనీ అనడం ,చాల దారుణమని , దుర్మార్గమని అంటున్నారు ఎమ్మెల్యే సండ్ర . తాను టీఆర్ యస్ లో చేరినప్పుడు కేసీఆర్ తనకు ఖమ్మంలో ఉంటున్న నివాసాన్ని రెగ్యూలరైజ్ చేశారని ప్రచారం జరిగిందని, ఇప్పటికైనా ఇది వాస్తవం కాదనే విషయాన్నీ ప్రజలు గ్రహించాలని అన్నారు .తాను పార్టీ మారింది నా నియోజకవర్గ అభివృద్ధి కోసం , ప్రజల బాగుకోసం , చేరనే తప్ప దేన్నీ ఆశించలేదన్నారు . అప్పుడు కూడా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేశారని వాపోయారు . ఇప్పటికి సత్తుపల్లిలో మూడు సార్లు గెలిచినా తాను అక్కడ ప్రజల అభిమానంతో వారి అండదండలు , ఆదరణతోనేనని అన్నారు . అందుకే వాళ్ళకోసం కష్టపడటం, వారికీ ఏదైనా చేయాలనే తలంపుతోనే ముందుకు సాగుతున్నట్లు చెప్పారు . సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గ అభివృధ్ధికోసం సహకరిస్తున్నారని అందుకే కొన్ని పనులు చేయగలిగామని ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని అన్నారు. సీఎం ను కలిసి అనేక మార్లు నియోజకవర్గ అభివృధ్ధికోసం నిధులు అడిగానని సానుకూలంగా స్పందించారని సత్తుపల్లి ప్రజల అండ ,కేసీఆర్ దీవెనలు ఉన్నంతకాలం వారికీ సేవచేస్తానని ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు …