Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గంటా పయనమెటు …

కాపునాడు పోస్టర్ విడుదల సందర్భంగా హాట్ కామెంట్స్ …
టీడీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు
పార్టీ మార్పుపై తానెప్పుడూ మాట్లాడలేదన్న గంటా
ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని వెల్లడి
రంగా ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో పరిమితం కాదని వ్యాఖ్య

గంటా శ్రీనివాస్ రావు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ శాసనసభ్యుడు .చాలాకాలంగా పార్టీ దూరంగా ఉంటున్నారు . ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.అయితే కొంతకాలం క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారు . ఇక పార్టీ మారాడని చంద్రబాబుతో సఖ్యత కుదిరిందని భావించారు .కానీ ఇటీవల కాలంలో ఆయన పార్టీ వీడుతున్నారని వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. దానిపై ఆయన స్పందించారు . తన పార్టీ మారితే ముందుగానే చెపుతానని స్పష్టం చేశారు . ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఎందులో చేరతారు .అనేది సస్పెన్స్ గా ఉంది. కొద్దిరోజులు క్రితం చిరంజీవిని కలిశారు . ఇప్పడు కాపునాడు సభ పోస్టర్ ను విడుదల చేశారు . అందులో చిరంజీవి పవన్ కళ్యాణ్ , వంగవీటి రంగ ఫోటోలు పెట్టారు . దీంతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు ? అనే సందేహాలు కలుగుతున్నాయి.

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నారంటూ కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పుపై తానెప్పుడూ మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నవి కేవలం రెండు పార్టీలు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు.

ఇక వంగవీటి రంగా ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో ప్రతినిధి కాదని… రంగా బడుగు, బలహీన వర్గాల నాయకుడని అన్నారు. బడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుబడ్డారు కాబట్టే వారి గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. కాపునాడు బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపునాడు సభను విజయవంతం చేయాలని కోరారు. కాపునాడు పోస్టర్ పై వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రముఖంగా ముద్రించారు.

Related posts

ఆజాద్ అండ్ కో తో తెగతెంపులేనా ?

Drukpadam

మసక బారుతున్న మోడీ-షాల ప్రభ ….

Drukpadam

టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు.. విందులో గోదావరి రుచులు!

Drukpadam

Leave a Comment