Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో జరిగిన సిపిఎం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్!

ఖమ్మంలో జరిగిన సిపిఎం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్!
తరలి వచ్చిన లక్షమందికి పైగా ప్రజలు
అద్భుత ఉపన్యాసాలతో ఆకట్టుకున్న నాయకులు
చూపరులను ఆకర్షించిన ఎర్రదండు కవాతు
బీజేపీ ప్రమాదంపై ఎక్కుపెట్టిన నేతలు

 

ఇటీవల కాలంలో ఎన్నుడు లేని విధంగా సిపిఎం ఖమ్మం లో గురువారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది . సభకు నిర్వాహకులు అనుకున్నదానికంటే అధికంగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు . ఒక్క ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు ప్రత్యేకించి వ్యవసాయ కార్మికులు తరలి వచ్చారు .ఇందుకు కోసం సిపిఎం కార్యకర్తలు గత రెండు మూడు నెలలుగా పడుతున్న శ్రమకు ఫలితం దక్కినట్లు అయింది. ఎర్రజెండా కవాతులో యువకులు ,మహిళలు పాల్గొని దిక్కులు పిక్కటిల్లే నినాదాలతో ఖమ్మం పురవీధులను హోరెత్తించారు . వేలాది మంది రెడ్ షర్టు వాలంటీర్లు , మహిళలు పాల్గొని కవాతు చేయడం నగరప్రజలను ఆకర్శించింది .

 

సభకు ముఖ్యఅతిధిగా హాజరైన పినరాయ్ విజయన్ హైద్రాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా ఖమ్మం కు చేరుకున్నారు .ఖమ్మంలో ప్రోటోకాల్ ప్రకారం విజయన్ కు అధికారులు భద్రతా కల్పించారు .

ఇక సభలో నాయకులు చేసిన ప్రసంగాలు ప్రజలను కట్టి పడేశాయి. కమ్యూనిస్టుల పని అయిపోయిందనిప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జరిగిన బహిరంగ సభ కమ్యూనిస్ట్ వ్యతిరేకుల నోరు మూయించిందనే చేప్పాలి . కేరళ సీఎం విజయన్ తోపాటు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రసంగం సిపిఎం విధానాలపై స్పష్టత లేని వారికీ స్పష్టత నిచ్చింది .

ప్రధానంగా బీజేపీ పై నాయకులు బాణాలు ఎక్కుపెట్టారు . దేశంలో అనేక సమస్యలు ఉండగా మతసమస్యలపై రెచ్చెగొట్టే ధోరణితో బీజేపీ చేస్తున్న యాత్రలపై తమ్మినేని మండి పడ్డారు . దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత , దానికోసం పనిచేస్తున్న కూలీలు ఏమతం ? ఏకులం ? అని ఎవరు చూడరని , అన్నదమ్ముల్లా , అక్క చెల్లెళ్లులా ఉంటున్న హిందూ ,ముస్లిం, క్రిస్టియన్లను చీల్చి రాజ్యాధికారం కోసం బీజేపీ చేస్తున్న విచ్చిన్నకర రాజకీయాలను తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు . విద్య , వైద్యం , ఉద్యోగం , వేతనాల పెంపు , ప్రజల సంక్షేమం పై మాట్లాడని బీజేపీ మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు .

పొత్తులు ,ఎత్తులు ఎన్నికలు అసలు సమస్య కాదని అసలు సమస్య దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని గద్దె దించేందుకు దేశప్రజలంతా ఐక్యం కావాలని అన్నారు . మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు లేకపోతె మేము గెలిచేవాళ్ళమే కాదని బీఆర్ యస్ నాయకులు అంగీకరిస్తున్న విషయాన్నీ తమ్మినేని ప్రస్తావించారు . సీఎం కేసీఆర్ తో కలిసిన సందర్భంగా ప్రజల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ప్రస్తహిం
చామని
అందులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉందని అన్నారు . పోడుభూములకు పట్టాలు , ధరణి , కౌలు రైతుల సమస్యపై వివరంగా సీఎం దృష్టికి తమవైఖరిని వెల్లడించి త్వరగా పరిస్కారం చేయాలనీ కోరామని అందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేసారని అన్నారు . సీట్లు ,పోటీలు ,పొత్తుల విషయంలో వస్తున్న వార్తలను ఖండించారు . పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు జరగలేదని స్పష్టం చేశారు .

సభలు జయప్రదం అయ్యేందుకు సహకరించిన ఖమ్మం జిల్లా ప్రజలకు తమ్మినేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . సభకు ఇంతమంది తరలిరావడం ఎర్రజెండా ఖ్యాతిని చాటి చెబుతుందని అన్నారు .

Related posts

నేను పార్టీ పెట్ట‌లేదు..పార్టీ మార‌లేదు : ఈటల కొత్త స్వరం…

Drukpadam

అజిత్ పవార్ అటు వైపు వెళ్లడం వెనుక శరద్ పవార్ ఆశీస్సులున్నాయి: రాజ్ థాకరే…

Drukpadam

సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదు …బండి సంజయ్

Drukpadam

Leave a Comment