Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ను కలిసిన టీయూడబ్యూజే (ఐజేయూ ) నాయకులు

కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు

  • న్యూ ఇయర్ సందర్భంగా పుష్పగుచ్చంతో అభినందనలు
  • జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

    నూతన సంవత్సరం సందర్భంగా టి యు డబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ నాయకులు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
    కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు కట్టెకోల రామనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పనిచేసిన కొందరు కలెక్టర్ల ఉన్నతమైన పనితీరును ప్రస్తావించారు. కలెక్టర్ గా తమరి పనితీరు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు నచ్చే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జర్నలిస్టు మిత్రులందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ జర్నలిస్టు రవీంద్ర శేషు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, ఖమ్మం నగర కమిటీ , ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు, యూనియన్ నగర కమిటీ కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు , ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె మొహిద్దిన్, జిల్లా ఆర్గ నైజింగ్ సెక్రటరీ ఏగినాటి మాధవరావు, ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుషోత్తం, జిల్లా నాయకులు జనార్ధన చారి, మేడి రమేష్, నగర కోశాధికారి రాయల బసవేశ్వర రావు, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పారావు, జకీర్, విజయ్, ఫోటో జర్నలిస్టు తాజ్ నోత్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికాలో మనోడు భలే మోసం ….

Drukpadam

అదానీ కేసులో మీడియాను కట్టడి చేయడానికి నో చెప్పిన సుప్రీంకోర్టు!

Drukpadam

నార్సింగి రోడ్డు ప్రమాద ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Drukpadam

Leave a Comment