Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రంలో హాట్ సీట్ గా పాలేరు …

రాష్ట్రంలో హాట్ సీట్ గా పాలేరు
సీటుపై షర్మిల కన్నుపోటీచేస్తానని ప్రకటన
క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేసిన షర్మిల
సాయి గణేష్ నగర్ లో క్యాంపు కార్యాలయం ఏర్పాటు
మేము సైతం అంటున్న మాజీమంత్రి తుమ్మల , సిపిఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని , సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల
తుమ్మల క్యాంపు కార్యాలయం ఏర్పాటు
తమ్మినేని సైతం నియోజకర్గంపై కేంద్రీకరణ
ఇప్పటికే కార్యాలయం కలిగి ఉన్న కందాల

 

 

రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్ గా మారింది . ఇందుకు కారణం లేకపోలేదు . ఇక్కడ నుంచి హేమాహేమీలు పోటీకి సిద్దపడటమే ఇందుకు కారణం .ప్రధానంగా తెలంగాణ లో పార్టీ పెట్టి వైయస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని రాష్ట్రమంతా తిరుగుతున్న షర్మిల పాలేరు పై కన్నేశారు .ఇక్కడ నుంచి పోటీచేస్తున్నట్లుగా ఖమ్మం జిల్లా పాదయాత్రలో ప్రకటించారు .ఇదే విషయాన్నీ పలుమార్లు చెప్పారు . అందుకు అనుగుణంగానే ఆమె ఇక్కడ నుంచి పోటీచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు . ఆమె క్యాంపు కార్యాలయం కోసం ఖమ్మం నగరం పక్కనే కరుణగిరి వద్ద స్థలం కొనుగోలు చేశారు .సుమారు ఎకరం స్థలంలో ఆమె క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు .ఇటీవలనే ఆస్థలంలో తల్లి విజయమ్మతోకలిసి వచ్చి భూమి పూజ చేశారు .నియోజకవర్గంలో యంత్రాంగాన్నిసన్నద్ధం చేస్తున్నారు .

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి . ఆమె పార్టీ పాలేరులో పెద్దగా లేదుఆమె ఎందుకు పాలేరును ఎంచుకున్నారనే సందేహాలు లేకపోలేదు. మాజీ సీఎం సంక్షేమ పాలకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా గుర్తింపు ఉంది. ఎస్సీ, ఎస్టీలలో రాజశేఖర్ రెడ్డి పట్ల ఉన్న మంచి అభిప్రాయం ఆమెకు కలిసొస్తుందని భావిస్తున్నారు . అది ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఆమె ఇక్కడ పోటీచేయాలనుకోవడం సరైందేనా అనే అభిప్రాయాలకుసమాదానాలు దొరకడంలేదు . రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఆదరణ ఓట్లరూపంలో షర్మిలకు ఉపయోగపడుతుందా? లేదా ? అనేది సందేహమే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జగన్ వైసీపీ పెట్టినప్పుడు 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటు , మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకొని సత్తా చాటింది. అదే విధంగా మరో రెండు నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో సైతం గణనీయమైన ఓట్లు పొందగలిగింది. అందువల్ల షర్మిల కూడా ఖమ్మం జిల్లా అయితే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం . ఆమె పోటీ ఎలా ఉంటుంది. బలమైన బీఆర్ యస్ , సిపిఎం , కాంగ్రెస్ పార్టీలు ఉండగా ఆమెకు ప్రజలనుంచి ఎలా ఆదరణ ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.

ఇక బీఆర్ యస్ పార్టీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బరిలో ఉంటారని రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి పాలేరు నియోజకర్గ పర్యటనలో ప్రకటించారు . లెఫ్ట్ తో పొత్తుల్లో భాగంగా సీటు సిపిఎం గట్టిగ డిమాండ్ చేస్తుంది. సిపిఎం పోటీలో ఉంటె ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈనియోజకవర్గంపై సిపిఎం వ్యూహాత్మకంగా క్యాడర్ ను సిద్ధం చేస్తుంది. తమ్మినేని స్వగ్రామం తెల్దారుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటం గమనార్హంఇక మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్ యస్ టికెట్ తనకే అని చెబుతున్నారు . ఒకవేళ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరతారా ? లేక ఇండిపెండెంట్ గా పోటీచేస్తారా ?అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ఆయన పోటీ మాత్రం ఖాయం అంటున్నారు .ఇందుకోసం ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీలో నూతన గృహప్రవేశం చేశారు . సందర్భంగా ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చారు . కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు , మద్ది శ్రీనివాస్ రెడ్డి లు ప్రయత్నాలు చేస్తున్నారు . బీజేపీ నుంచి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఉన్నారు . కొత్తగా బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ , బీజేపీలో చేరితే వారికీ టికెట్స్ దక్కే అవకాశం లెకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . దీంతో పాలేరు హట్ సీటుగా మారింది….

Related posts

హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం!

Drukpadam

పంజాబ్ కాంగ్రెస్ లో కుంపటి … ముఖ్యమంత్రి అమరేందర్ రాజీనామా !

Drukpadam

తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోదీ… వాళ్ల పేర్లు చెప్పాలన్న కపిల్ సిబాల్…

Drukpadam

Leave a Comment