Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఐడీ కేసులు అక్రమమో, సక్రమమో కోర్టులే తేలుస్తాయి: సునీల్ కుమార్

సీఐడీ కేసులు అక్రమమో, సక్రమమో కోర్టులే తేలుస్తాయి: సునీల్ కుమార్

  • గుంటూరులో టెన్నిస్ టోర్నమెంట్
  • ప్రారంభించిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
  • సీఐడీ వ్యవస్థను అందరికీ తెలిసేలా చేశారన్న మీడియా ప్రతినిధి
  • పరిస్థితుల వల్లే సీఐడీ వెలుగులోకి వచ్చిందన్న సునీల్ కుమార్

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నేడు గుంటూరు పోలీసు కార్యాలయంలో ఇన్విటేషన్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది.

“సీఐడీ వ్యవస్థను వెలుగులోకి తెచ్చారు… ఏమనిపిస్తోంది సార్? గతంలో పోలీసులు అంటే తెలిసేది… ఇప్పుడు సీఐడీని కూడా పబ్లిక్ కి తెలిసేలా చేశారు” అంటూ సునీల్ కుమార్ ను ఓ రిపోర్టర్ అడిగారు. అందుకు సునీల్ కుమార్ నవ్వుతూ బదులిచ్చారు. తాను వచ్చాక సీఐడీ తెరపైకి రాలేదని, పరిస్థితుల వల్లే సీఐడీ వెలుగులోకి వచ్చిందని అన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు… సునీల్ కుమార్ అక్రమ కేసులు బనాయిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు… దీనిపై మీరేమంటారని ఆ మీడియా ప్రతినిధి అడగ్గా… “అందరూ ఏవేవో మాట్లాడుతుంటారు… ఆ కేసులు అక్రమమో, సక్రమమో తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా?” అని సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు.

Related posts

ప్రపంచంలో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్!

Drukpadam

మన సుప్రీంకోర్టులో సింగపూర్ సీజే!

Drukpadam

భట్టి పీపుల్స్ మార్చ్@100 డేస్…

Drukpadam

Leave a Comment