Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశ మంతా రైతుబంధు పీఎం కిసాన్ పేరుతో అమలు : హరీశ్ రావు!

దేశ మంతా రైతుబంధు పీఎం కిసాన్ పేరుతో అమలు : హరీశ్ రావు!
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
ఉద్యమ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందన్న హరీశ్
మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలని వ్యాఖ్య
మిషన్ సరోవర్ పేరుతో నీటి ప్రాజక్టులు
దేశమంతా వెలుగు జిలుగులు …నిరంతర విద్యుత్

ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని మంత్రి హరీశ్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పారు. తమ ప్రభుత్వ పథకాలను రేపు దేశమంతా అమలు చేస్తామని అన్నారు. రైతుబంధును సీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తుందని తెలిపారు. మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో బీఆర్ఎస్ అమలు చేస్తుందని అన్నారు. దేశమంతా వెలుగు జిలుగులు తాము నింపుతామని నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని హరీష్ రావు అన్నారు .

మతతత్వ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఇంటికి పంపిస్తేనే ప్రభుత్వ సంస్థలు మనుగడ సాగించగలవని చెప్పారు. దేశ వ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? ఉద్యోగాలను తొలగించే బీజేపీ కావాలా? అని ప్రశ్నించారు.

Related posts

The 5 Best Curling Irons For Beginners, According To A Stylist

Drukpadam

రష్యా వార్నింగ్ ను లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసిన ఉక్రెయిన్ సైనికులు

Drukpadam

జపాన్ కుబేరుడు అంతరిక్ష యాత్ర సక్సెస్… సురక్షితంగా భూమి పైకి!

Drukpadam

Leave a Comment