ఆంధ్రప్రదేశ్

పోలీసులు చర్యలు తీసుకోక పోతే నేను రంగంలోకి దిగుతా … కేఏ పాల్

  • తిరుపతిలో జేమ్స్ అనే బీటెక్ విద్యార్థి కిడ్నాప్, చిత్రహింసలకు గురయ్యాడని ఆరోపణ
  • రాష్ట్రంలో అన్యాయం, అక్రమ రవాణా, హింస రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తిరుపతిలో జేమ్స్ అనే బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి, చిత్ర హింసలకు గురి చేసి, చని పోయాడనుకుని వదిలేశారని కేఏ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాయం, అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. “చంద్రబాబు గారూ… ధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మీ 50 సంవత్సరాల అనుభవం ఏమైంది?” అని ప్రశ్నించారు. పోలీసులు తమ విధులను సరిగా నిర్వర్తించడంలో విఫలమైతే, తానే స్వయంగా రంగంలోకి దిగుతానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ప్రజలందరూ మే 24న సికింద్రాబాద్ లో జరగనున్న గ్లోబల్ పీస్ అసెంబ్లీలో పాల్గొనాలని కూడా ఆయన పిలుపు నిచ్చారు. “జేమ్స్‌కు న్యాయం జరగాలి” (JusticeForJames) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తక్షణమే దృష్టి సారించి, ప్రజలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

Banten’s Sawarna: A Hidden Paradise Facing The Indian Ocean

Drukpadam

తండ్రికి కుమార్తె అక్షర నీరాజనం.. ఆనంద గజపతి రాజు జీవితంపై పుస్తకావిష్కరణ..!

Ram Narayana

సుప్రీం తీర్పు వచ్చేవరకు కవిత విచారణకు వెళ్ళరు …లాయర్ భరత్!

Drukpadam