Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

అక్కినేని.. తొక్కినేని’ అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై దుమారం ….

అక్కినేని.. తొక్కినేని’ అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై దుమారం ….
-తీవ్రంగా స్పందించిన అక్కినేని ఫ్యామిలీ ,
-ఎస్వీ రంగారావు ను అన్నందుకు కాపులు గరంగరం ..
-ఈ నెల 25 లోపు క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు డిమాండ్
-బాలకృష్ణ పై అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కౌంటర్
-‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు
-ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలన్న అక్కినేని వారసులు
-వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అని వ్యాఖ్య

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపాయి. సినీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కాపులతో చెలిమి చేసుకొని ఈసారి తిరిగి అధికారంలోకి రావాలన్న చంద్రబాబు వ్యూహాలకు బాలకృష్ణ వ్యాఖ్యలు ఆటంకంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టీడీపీ వర్గాలు బాలయ్య మాటలు తమకు ప్రతికూలంగా మారతాయని అభిప్రాయంతో ఉన్నారు .

ఆదివారం రాత్రి జరిగిన ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ ,ఆ రంగారావు ఈ రంగారావు… ఆ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అటు అక్కినేని అభిమానులు , ఎస్వీ రంగారావు అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . ప్రత్యేకించి కాపులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఎస్వీ రంగారావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు… ఈ నెల 25 లోపు క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు డిమాండ్ చేశారు . ఇప్పటికే బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్
తాజాగా కాపునాడుకు అల్టిమేటం ఇచ్చింది . బాలకృష్ణ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలుగు చిత్రసీమ దిగ్గజాలు అయిన ఎస్వీఆర్, ఏఎన్నార్ లను ఎంతో చులకనగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా కాపునాడు మండిపడుతోంది. ఎస్వీ రంగారావుపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. బాలకృష్ణ ఈ నెల 25 లోపు మీడియా ఎదుటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు డిమాండ్ చేసింది.

బాలకృష్ణ రేపటి లోగా క్షమాపణ చెప్పకపోతే నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరించింది. బాలకృష్ణను టీడీపీ పదేళ్లపాటు బహిష్కరించాలని స్పష్టం చేసింది. ఏపీలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాల వద్ద కాపులందరూ ప్లకార్డులు చేతబట్టి, మౌన ప్రదర్శన నిర్వహించాలని కాపునాడు పిలుపునిచ్చింది.

ఇంతకుముందు కూడా చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యారని, రాజకీయాలు తమకే సాధ్యమంటూ బాలకృష్ణ అన్నారని, జనసేన పార్టీలో ఉండేవాళ్లు అలగాజనం, సంకరజాతి అనే మాటలు తమను ఎంతో గాయపరిచాయని కాపునాడు నేతలు పేర్కొన్నారు.

బాలకృష్ణ మాటలు జనసేన ,టీడీపీ పొత్తులకు ఇబ్బందిగా మారాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలో మరి …!

Related posts

ఏఐ టెక్నాలజీతో ఎంతో స్టయిలిష్ గా అక్కినేని నాగేశ్వరరావు… రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Ram Narayana

బ్యాలెట్ విధానంలోనే ‘మా’ ఎన్నికలు…

Drukpadam

థియేట‌ర్ల స‌మ‌స్య‌పై ఏపీ మంత్రుల‌తో నేను మాట్లాడ‌తాను: తెలంగాణ మంత్రి త‌ల‌సాని!

Drukpadam

Leave a Comment