Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓడిన వారిని గెలిపించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి

Poll Officer Charged As Wrong Candidates Declared Winners In UP Panchayat Election

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓడిన వారిని గెలిపించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి
-ధ్రువీకరణ పత్రాలు సైతం అందజేసిన వైనం
-ప్రత్యర్థుల గొడవతో తిరిగి రీకౌంటింగ్ జరిపిన జిల్లా మేజిస్ట్రేట్
-ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 500 మందికి పైగా పాల్గొన్నట్లు చెబుతున్న పోలీసులు
-60 మంది పేర్లతో కేసు నమోదు :18 మంది అరెస్ట్
-విషయం తెలిసిన తరువాత కటకటాలు:తదుపరి చర్యలకోసం ఎన్నికల అధికారులకు సిఫార్స్
ఎన్నికల్లో దొంగ ఓట్లు ,ఒక్కొక్కరు అనేక ఓట్లు వేయడం , అధికారులు అందుకు సహకరించటం , రిగ్గింగ్ జరపడం లాంటివి తరుచు ఇంటున్నాం . కానీ భారీ ఆధిక్యంతో గెలిచిన అభ్యర్థులు ఓడినట్లు ప్రకటించి ,ఓడినవారికి ధ్రువీకరణ పత్రాలు సైతం అందించిన ఘటన ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకొంది . ముఖ్యమంత్రి యోగిఅతిధ్యనాథ్ ప్రాతినిధ్యం వావిస్తున్న ఆయన స్వంత జిల్లాలో జిల్లా పంచాయత్ కు జరిగిన ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వీరేంద్ర కుమార్ 2 వేలకు పైగా ఓట్లతో గెలిచిన రవి నిషాద్ 60 ,కోడై నిషాద్ 61 వార్డులకు చెందిన జిల్లా పంచాయత్ సభ్యులను ఓడినట్లు ప్రకటించి వారిపై ఓడిన గోపాల్ యాదవ్ ,రమేష్ అనే ఇద్దరికీ గెలిచినట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తాము గెలిచినప్పటికీ ఓడినట్లు ప్రకటించడంపై మండిపడ్డ 60 , 61 జిల్లా పంచాయతీ వార్డు సభ్యులు ,వారి అనుచరులతో కలిసి అధికారి నిర్వహకంపై విధ్వసం సృష్టించారు. దీనిపై జోక్యం చేసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ విజయేంద్ర పాండ్యన్ తిరిగి లెక్కింపుకు ఆదేశాలు జారీచేశారు. రీకౌంటింగ్ లో ఒడి నట్లు ఎ ఆర్ ఓ వీరేంద్ర కుమార్ ప్రకటించిన రవి నిషాద్ , కొడైనిషాద్ లు గెలుపొందారు. ఎ ఆర్ ఓ మోసం ,దగా ,అక్రంగా తాము గెలిచిన ఓడినట్లు ప్రకాయించారని వారు ఆరోపించారు. ఎన్నికల అధికారిపై చర్యలకు డిమాండ్ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ ఫిర్యదు మేరకు ఇరిగేషన్ శాఖలో ఇ ఇ గా పనిచేస్తున్న , ఎ ఆర్ ఓ వీరేంద్ర కుమార్ పై కేసు నమోదు చేశారు. ఆయన కటకటాలపాలైయ్యారు . తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు. నైబజార్ పోలీస్ అవుట్ పోస్ట్ పై దాడిచేసి దాన్ని తగలబెట్టారు . పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది . ఈ దాడి ఘటనలో 500 పైగా వారి అనుచరులు పాల్గొన్నట్లు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు.వారిలో 60 మందిని గుర్తించిన పోలీసులు వారిపై నాలుగు రకాల ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి చర్య సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యోగి సర్కార్ లో ఇలాంటి మోసాలు ఎన్నో ఉన్నాయని దుమ్మెత్తి పోస్తున్నాయి.

Related posts

Drukpadam

హిమాచల్​ ను వణికిస్తున్న కొండచరియలు.. నదీ ప్రవాహాన్నే అడ్డుకున్న వైనం..

Drukpadam

92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అవుతున్న మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్!

Drukpadam

Leave a Comment