Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసిపి లో పెరుగుతున్న అసమ్మతి … అవమానాలను భరించలేనన్నఎమ్మెల్యే కోటం రెడ్డి!

వైసిపి లో పెరుగుతున్న అసమ్మతి … అవమానాలను భరించలేనన్నఎమ్మెల్యే కోటం రెడ్డి!
-తన తమ్ముడిని తనపై పోటీకి రెచ్చగొడుతున్నారని ఆవేదన
-అలా అయితే రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న శ్రీధర్ రెడ్డి
-తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి ఆగ్రహం
-అవమానం ఉన్నచోట కొనసాగలేనని వ్యాఖ్య

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి అసమ్మతిస్వరం నివిపించగా , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నానని బాంబు పేల్చారు .

అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ నే ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుమానం ఉన్న చోట తాను కొనసాగడం కష్టమని ఆయన అన్నారు.

తన సోదరుడు గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను ఎన్నికల బరిలో నిలబడనని చెప్పారు. తన తమ్ముడికి పోటీగా తాను నిలబడనని అన్నారు. తన తమ్ముడిని తనపై పోటీకి నిలబడేలా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే రాజకీయాలకు గుడ్ బై చెపుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవమానాలను భరించలేనని చెప్పారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.

Related posts

బీజేపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు ,ధాన్యం కొనడంలేదు …మంత్రి నిరంజన్ రెడ్డి !

Drukpadam

విజయవాడలో గద్దె రామ్మోహన్ వర్సెస్ దేవినేని అవినాశ్

Drukpadam

జానారెడ్డే మా సీఎం అభ్యర్థి … కాంగ్రెస్ నేతలు

Drukpadam

Leave a Comment