Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల పై మరల ట్రోలింగ్…!

తుమ్మల పై మరల ట్రోలింగ్…!
ప్రజాక్షేత్రమా..? పెద్దల సభాకా …??
ఖమ్మం బీఆర్ యస్ సభకు ముందు వరకు పార్టీకి దూరంగా ఉన్న తుమ్మల
కేసీఆర్ సూచనలతో రంగంలోకి దిగిన తుమ్మల
పెద్దల సభకు పంపుతారంటూ ప్రచారం
ప్రజాక్షేత్రం లోనే తేల్చుకుంటానని శపథం

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న తుమ్మల ప్రజాక్షేత్రంలోకా..? పెద్దల సభాకా …?? అనేది చర్చనీయాంశంగా మారింది .ఆయన మాత్రం తనకు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని ఉందని అక్కడే తేల్చుకుంటానని శపథం చేశారు .
గత ఎన్నికల్లో ఓడిన పాలేరు తన కార్యక్షేత్రమని పలుమార్లు కుండబద్దలు కొట్టారు . అయితే మారిన రాజకీయ పరిస్థితులు , సమీకరణాల నేపథ్యంలో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని తేల్చుకోలేక పోతున్నారు . తాను పార్టీ మారతానని ఎప్పుడు చెప్పనప్పటికీ చాలామంది ఆయన అభిమానులు ఆయన పార్టీ మారితే బాగుటుందని చెప్పినట్లు సమాచారం . ఇటీవల ఖమ్మం లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బహిరంగ సభ జరిగింది. అందులో కొందరు మాజీలు జిల్లా నుంచి పార్టీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఎవరు చేరలేదు .తుమ్మల తిరిగి టీడీపీలోకి వస్తున్నారని , టీడీపీబీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ నుంచి పాలేరు లో పోటీచేస్తారని చాలామంది అనుకున్నారు . ఆవిధంగా మీడియా లో వార్తలు కూడా వచ్చాయి. జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు చంద్రబాబు ఖమ్మం రాక సందర్భంగా, కొంతమంది నాయకులు గతంలో టీడీపీ లో ఉన్న మాజీ నాయకులను కలిశారు .వారి మాటల్లో కొంతమంది పెద్దలు తిరిగి టీడీపీలోకి వస్తున్నట్లు ప్రచారం చేశారు . కానీ అది జరగలేదు . బీజేపీటీడీపీ మధ్య పొత్తు ఉండదని బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీలో చేరదామని అనుకున్నవారు కూడా వెనకడుగు వేశారు .

ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ సభకు ముందువరకు తుమ్మల పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి.అందుకు తగ్గట్లుగానే ఆయన కూడా పార్టీకి సంబంధం లేకుండా సొంత కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రాధాన్యత ఇచ్చారు . వాజేడు లో ఆత్మీయసమావేశం నిర్వహించారు. , ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీ లో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశం సందర్భంగా తన అభిమానులను పిలిచి భోజనాలు పెట్టారు . దానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు . అప్పటికే మరో అసమ్మతినేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు గులాబీ బాస్ కు సమాచారం అందటంతో జిల్లాలో పార్టీని చక్కదిద్దటంపై ద్రుష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే ఢిల్లీ లో పెడదాం అనుకున్న బీఆర్ యస్ మొదటి సభను ఖమ్మం కు మార్చారు . ఈసభ జయప్రదం చేసేందుకు సీనియర్ మంత్రి ట్రుబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ను నియమించారు. ఆయన ఖమ్మంలో వారం రోజులు మకాం వేసి పార్టీలో నాయకుల మధ్య ఐక్యత తీసుకోని రావడంతోపాటు తుమ్మల లాంటి సీనియర్ నేతను బీఆర్ యస్ సభ కార్యక్రమాల్లో, జనసమీకరణలో ఇన్వాల్వు చేశారు. ఆయన ఇంటికి ఎడమొహం పెడమొహంగా ఉన్న జిల్లా మంత్రి అజయ్ ను, తుమ్మల అంటే గిట్టని వెంకటవీరయ్య ను తీసుకోని వెళ్లి పార్టీ సభ జయప్రదం చేసేందుకు రావాలని ఇది కేసీఆర్ మాట అని చెప్పారు . దీంతో పార్టీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్న తుమ్మల తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించు కున్నారు . సభ కార్యక్రమాల్లో జోరుగా , ఉషారుగా తిరిగారు . దీంతో ఇప్పుడు ఇక ఆయన చట్ట సభల్లో ప్రవేశం పై చర్చ జరుగుతుంది. ఆయన్ను వచ్చే మార్చిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ పదవుల్లో తుమ్మలకు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డికి సీట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ వర్గాలనుంచి ఎలాంటి సమాచారం లేదుకేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు . పాలేరు సీటు సిపిఎం కు ఇస్తారా లేక బీఆర్ యస్ పోటీచేస్తుందా ? ఎవరిని పెద్దల సభకు పంపుతారు ? ఎవరిని అసెంబ్లీ బరిలో నిలుపుతారు అనేది ఆసక్తిగా మారింది….!

 

Related posts

పంజాబ్ సీఎం మందుతాగి విమానం ఎక్కేండుంటూ ప్రచారం …ఖండించిన ఆప్

Drukpadam

23 ఏళ్లకే బళ్లారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన యువతి!

Drukpadam

రాజీవ్ స్వగృహాలను మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలి…సిపిఎం

Drukpadam

Leave a Comment