Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బడ్జెట్ పేరు గొప్ప …ఊరు దిబ్బలా ఉంది…తెలంగాణకు అన్యాయం:ఎంపీ వద్దిరాజు రవి చంద్ర!

బడ్జెట్ పేరు గొప్ప …ఊరు దిబ్బలా ఉంది…తెలంగాణకు అన్యాయం:ఎంపీ వద్దిరాజు రవి చంద్ర!
-కాళేశ్వరం జాతీయహోదా ఊసేలేదు …నిధులు కేటాయింపు లేదు
-రాష్ట్రాలను బలహీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది
-నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రంగానికి కూడా మంచి చేసేదిగా లేదు

కేంద్రం బుధవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేరు గొప్ప …ఊరు దిబ్బలా ఉందని, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు . తెలంగాణకు కేటాయింపులు లేకపోగా అన్యాయం జరిగిందని ఇది కేంద్రం పక్షపాత ధోరణికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు . ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల డిమాండ్ ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. కేంద్రం తాము అధికారంలో ఉన్న , లేక ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక లాంటి రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి తెలంగాణ కు సవతితల్లి ప్రేమ చూపడాన్ని రవిచంద్ర తప్పు పట్టారు .
కేంద్రం గతంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే,అందులో ఒకటంటే ఒకటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని బడ్జెట్ లో పేర్కొన్నారు,అయితే వీటిలో కూడా తెలంగాణకు కేంద్రం అన్యాయమే చేసేటట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు . తమ పార్టీ ఆధ్వరంలో తెలంగాణకు నిధులు కోసం పార్లమెంట్లో పోరాడతామని వద్దిరాజు తెలిపారు .

తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయకపోవడం, గిరిజన విశ్వవిద్యాలయానికి ఆశించిన రీతిలో నిధులివ్వకపోవడం,జిల్లాకో నవోదయ పాఠశాల,బయ్యారం స్టీల్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి ప్రస్తావించకపోవడం తీవ్ర విచారకరం

Related posts

కురుక్షేత్రాన్ని తలపిస్తున్న ఈటల వర్సెస్ గంగుల మాటల యుద్ధం

Drukpadam

హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే ప్ర‌తిపాద‌న ఉంది: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

Drukpadam

దయచేసి మా ఇద్దరిపై ఆ ప్రచారాన్ని ఆపేయండి: బండి సంజయ్

Drukpadam

Leave a Comment