Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మరోసారి చైనా బెలూన్ కలకలం… ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!

మరోసారి చైనా బెలూన్ కలకలం… ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!

  • ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కలకలం
  • మిస్సైల్ తో బెలూన్ ను కూల్చివేసిన అమెరికా
  • కొన్నిరోజుల వ్యవధిలో మరో బెలూన్ ప్రత్యక్షం
  • కొలంబియా, కోస్టారికా, వెనిజులా దేశాల మీదుగా పయనం

ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ దర్శనమివ్వడం, అమెరికా ఏఐఎం-9ఎక్స్ సైడ్ వైండర్ క్షిపణితో దానిని కూల్చివేయడం తెలిసిందే. ఆ బెలూన్ ద్వారా తమపై చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. చైనా మాత్రం అది వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన బెలూన్ అని చెబుతోంది.

ఈ నేపథ్యంలో, రెండో బెలూన్ కూడా దర్శనమిచ్చింది. ఇది కూడా చైనాదేనని వెల్లడైంది. ఈ బెలూన్ ను లాటిన్ అమెరికా దేశాల గగనతలంలో గుర్తించారు. అయితే లాటిన్ అమెరికా దేశాలు ఈ బెలూన్ ను తేలిగ్గా తీసుకున్నాయి.

ఈ రెండో బెలూన్ ను మొదట గుర్తించింది అమెరికా రక్షణశాఖే. అమెరికా గగనతలంపై ఎగిరిన బెలూన్ తరహాలోనే ఉండడంతో ఇది కూడా చైనాదేనని నిర్ధారణకు వచ్చారు. చైనా కూడా ఆ రెండో బెలూన్ తమదేనని స్పష్టం చేసింది. ఈ బెలూన్ కొలంబియా, వెనిజులా, కోస్టారికా మీదుగా పయనించినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఆ బెలూన్ ఎక్కడుందన్నది తెలియరాలేదు. చైనాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు కలిగిన లాటిన్ అమెరికా దేశాలు దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, అమెరికా రక్షణ శాఖ మాత్రం దీనిపై తప్పకుండా ఓ కన్నేసి ఉంచుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related posts

జీపీఎస్ పరికరంతో భర్త రాసలీలల గుట్టురట్టు చేసిన భార్య

Drukpadam

దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ఉండటం గర్వకారణం: సీఎం కేసీఆర్!

Drukpadam

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో కంపించిన భూమి!

Drukpadam

Leave a Comment