Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విమానాల తయారీ సంస్థ బోయింగ్!

వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విమానాల తయారీ సంస్థ బోయింగ్!

  • లేఆఫ్ లు ప్రకటిస్తున్న దిగ్గజ సంస్థలు
  • అదే బాటలో బోయింగ్
  • 2 వేల మందికి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై మక్కువ

టెక్ సంస్థలు, ఈ-కామర్స్ సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తుండగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా అదే పంథాను ఎంచుకుంది. వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు బోయింగ్ సన్నద్ధమవుతోంది. బోయింగ్ యాజమాన్యం తాజా నిర్ణయంతో 2 వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారిస్థానంలో టీసీఎస్ సంస్థ ద్వారా ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవాలని బోయింగ్ భావిస్తోంది.

ముఖ్యంగా, మానవ వనరుల విభాగం, ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగులపై వేటు వేయాలని బోయింగ్ నిశ్చయించుకుంది. మూడింట ఒక వంతు ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలనేది బోయింగ్ నిర్ణయంగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

అయితే, ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లో ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టు బోయింగ్ వర్గాలు వెల్లడించాయి. బోయింగ్ నిర్ణయం చూస్తుంటే, కేవలం హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగాల్లోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అర్థమవుతోంది.

Related posts

ఈ నెల 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు..

Ram Narayana

షికాగోలో సైకిల్ తొక్కిన స్టాలిన్… స్పందించిన రాహుల్ గాంధీ

Ram Narayana

సంచలనంగా మారిన లిక్కర్ స్కాం లో కేజ్రీవాల్ పాత్ర…!

Drukpadam

Leave a Comment