Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ నాందేడ్ సభకుమిత్రులను ఎందుకు పిలవలేదు …?

కేసీఆర్ నాందేడ్ సభకుమిత్రులను ఎందుకు పిలవలేదు …?
మహాలో కేసీఆర్ పాగా వేస్తారా ?
కేసీఆర్ కు మిత్రులు ఎవరు ?శతృవులు ఎవరు ?
బీఆర్ యస్ తో దేశంలో మార్పు సాధ్యమేనా?
నేనే మంత్రినేనే రాజు అంటే కుదురుతుందా ?
అభివృద్ధి మంత్రమే కాదుప్రజల ప్రేమాభిమానాలు గెలుచుకోవాలి
తలబిరుసు తనముంటే నెత్తికెత్తు కున్న ప్రజలే నేలకు కొడతారు

కేసీఆర్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన బీఆర్ యస్ మొదటిసారిగా తన కార్యకలాపాను తెలంగాణ వెలుపల నిర్వహించింది. దానికి జనసమీకరణ కోసం తెలివిగా తెలంగాణ పక్కనే ఉన్న నాందేడ్ ను వేదికగా ఎంచుకుంది . సభ సక్సెస్ అయింది . నాందేడ్ సభకు ప్రజలను బాగానే సమీకరించింది . కేసీఆర్ హిందీలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది . సభకు తాను మిత్రపక్షాలుగా భావిస్తున్న పార్టీలను పిలవలేదు అందుకు కారణాలు చెప్పలేదుసభకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ నుంచి బీఆర్ యస్ శ్రేణులను తరలించారు .ముందు సభ అని చెప్పిన బీఆర్ యస్ దాన్ని సదస్సుగా మార్చింది. కేసీఆర్ మహారాష్ట్ర ప్రజల మనస్సులు దోచుకునేందుకు ప్రయత్నించారు . అక్కడ సిక్కులు ప్రభావం ఉన్నందున గురుద్వార్ కు వెళ్లారు .సిక్కుల సంప్రదాయం ప్రకారం తలపాగా తో వెళ్లిన కేసీఆర్ కు ఆలయ పూజారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు .అక్కడ మతగురువులు కేసీఆర్ కు పూజలు నిర్వహించారు .తర్వాత నేరుగా సభాస్థలికి చేరుకొని వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ , అంబెడ్కర్ ,పూలె ,సావిత్రిబాయి పూలె విగ్రహాలకు కేసీఆర్ పూలమాలలు వేశారు .సభలోనే కొంతమందిని పార్టీలో చేర్చుకొని వారికీ గులాబీ కండువాలు కప్పారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు .బీజేపీ ,కాంగ్రెస్ 70 సంవత్సరాల పాలనలో అభివృద్ధి సూన్యమని తమకు అధికారం ఇస్తే గుణాత్మక మార్పు చూస్తారని అన్నారు .

ఖమ్మంలో జనవరి 18 జరిగిన సభకు కేరళ, ఢిల్లీ , పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా ,సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం , కూనంనేని సాంబశివరావు లను ఆహ్వానించారు . నాందేడ్ సభకు మిత్రులను ఎందుకు పిలవలేదనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు కేసీఆర్ వ్యూహం ఏమిటి ? బీజేపీ ,కాంగ్రెస్ కాకుండా ఆయన శత్రులు ఎవరు ?మిత్రులు ఎవరనేది అనేది నిర్ణయించుకొన్నారో లేదో తెలియదునిజంగా బీజేపీని గద్దె దించి బీఆర్ యస్ ను అధికారంలోకి తీసుకోని రావాలంటే ఒక బ్రాడ్ ప్లాట్ ఫారం కావాలిఅందుకు లైక్ మైండెడ్ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకోని రావాలిగతంలో ఏపీ సీఎంగా ఉన్న ఎన్టీర్ కూడా కేంద్రం పై యుద్ధం ప్రకటించారు. అందుకు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కూడగట్టారు . వివిధ రాష్ట్రాల్లో కాంక్లివ్ పేరుతో అందరిని సమీకరించి ప్రతిపక్షాల సత్తాచాటారు .అలాంటివి జరగాలిఅందులో సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి ..తీసుకున్న నిర్ణయాలను తూ తప్పకుండ అమలు చేయాలినేనే రాజునేనే మంత్రి అంటే కుదరదుపేరు ఏదైనా ఒక ఫ్రంట్ ఏర్పడాలికామన్ ప్రోగ్రాం ప్రజల ముందు పెట్టాలిదేశంలో ఉన్న సమస్యలు వాటికీ పరిస్కార మార్గాలు చెప్పగలగాలి …. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు వాటిని విశ్వసించి ప్రజలను ఒప్పించి మెప్పించాలి

అందుకు ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న కృషిని పెంచాలితెలంగాణ మోడల్ పరిపాలన దేశమంతా అందిస్తామని అంటున్నారు . మంచిదేతెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలు చెపుతున్నట్లు అభివృద్ధి ఏమి జరగలేదా ? అంటే అనుకున్నంత కాకపోయినా , బంగారు తెలంగాణ అవ్వకపోయిన అభివృద్ధి జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ….మౌలిక సౌకర్యాల కల్పన దిశగా అడుగులు పడ్డాయి. రైతు బంద్ , 24 గంటల విద్యుత్ , రైతులకు ఉచిత విద్యుత్ , ఎస్సీలకు దళితబంధు , మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ , కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ , బతకమ్మ చీరెల పంపిణి , లాంటి అనేక బృహత్తర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు . ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం , సీతారాం ప్రాజెక్టు , వల్ల రాష్ట్రంలో భూవిస్తరణ పెరగడంతోపాటు ,రెండు పంటలకు గ్యారంటీ ఏర్పడింది .దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉండగా సాగులో ఉంది కేవలం 41 కోట్ల ఎకరాలేనని , లక్ష 40 వేల టీఎంసీ నీటిలభ్యత ఉండగా ఆవిరై పోయేది 70 వేల టీఎంసీలు కాగా , మనం ఉపయోగించేది కేవలం 30 వేల టీఎంసీ లోపునే ,ఇంకా మనం వాడుకోగలిగే 40 వేల టీఎంసీ నీటిని ఉపయోగించుకోలేకపోతున్నామని కేసీఆర్ గణాంకాలతో సహా వివరించడం ప్రజలను ఆకట్టుకుంటుంది .అంతే కాకుండా ఆయన విజనరీ ని తెలియజేస్తుంది. ఇలాంటి నాయకుడి చేతిలో దేశాన్ని పెడితే దేశం, ప్రజలు బాగుపడాతారనే ఆశలు కల్పిస్తున్నారు . కాకపోతే ఆయన ఒంటెత్తు పోకడలు సువిశాల ప్రజాస్వామ్య దేశంలో ఇబ్బందికరంగా మారతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. . నేనే రాజు ..నేనే మంత్రి అంటే కుదరదుప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే కాదుతలబిరుసు తనం కాకుండా ప్రేమాభిమానాలు పంచగలగాలి . అప్పుడు మాత్రమే దేశ ప్రజలు నాయకున్ని నెత్తికెత్తు కుంటారులేకపోతె నేలకు కొడతారుప్రజలకు తాయిలాలు కాదువారి అభిమానం పొందగలగాలిఅందుకు బీఆర్ యస్ నేతలు వేసే ప్రతి అడుగు, ప్రతిమాట నిజాయతీగా ,నిబద్ధతతగా ఉండాలిఆలా ఉండాలని, కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞం జయప్రదం కావాలని కోరుకుందాం ….

 

Related posts

మంత్రులకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్ ….

Drukpadam

ప్రక్షాళన దిశగా కేంద్ర కెబినెట్ …పలువురు మంత్రుల రాజీనామా !

Drukpadam

ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు పట్టు …నిన్న నేడు 23 మంది ఎంపీల సస్పెన్షన్ !

Drukpadam

Leave a Comment