మధిర భట్టి గెలుపులో సతి నందినిదే కీలక పాత్ర…
నాలుగవసారి మధిర ప్రజల ఆదరణ ఎలా ఉంటుందో …
–నియోజకవర్గంలో ప్రతి గడపను తట్టారు …అందుకే అందరు ఆమెను అమ్మ అని పిలుస్తుంటారు …
–ఆమె మాట మంచితనం ,సహాయం చేసే గుణం ప్రజల్లో సానుకూలత
–నియోజకవర్గ వ్యాపితంగా సంబంధాలు
–ఎక్కడ సమస్య ఉంటె అక్కడ ఆమె ప్రత్యక్షం అవుతారు
ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం అనగానే సీఎల్పీ నేత మధిర విక్రమార్క గుర్తుకు వస్తాడు … ఆయన మూడు సార్లు మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించారు . నాలుగవసారి గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు . ఒకరిని ఒకరు వెనక్కు లాగటం సొంతపార్టీ వారిని ఓడించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై మూడు సార్లు గెలవడం మాములు విషయం కాదు . ప్రతిమగవాడి విజయం వెనక ఒక మహిళా ఉంటుందనేది తరుచు వింటాం …భట్టి విజయంలో కూడా కచ్చితగంగా కీలకపాత్ర ఆయన సతీమణి నందినిదే అందంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయాలే ఉన్నాయి … ఆమె సౌమ్యురాలు …ఉన్నత విద్యావంతురాలు హిందీ ,ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు …మన రాష్ట్రం కాకపోయినా యూనివర్సిటీ లో ఏర్పడిన వారి పరిచయం లవ్ గా మరి పెళ్లి చేసుకున్నారు . ఆమె భట్టి కి సహాయపడేందుకు కస్టపడి తెలుగు సైతం నేర్చు కున్నారు . నియోజవర్గంలో అన్ని సమస్యలపై ఆమెకూడా పూర్తీ అవహగాహన కలిగి ఉన్నారు . అమ్మ పౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . అంతే కాకుండా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సహాయం కావాలన్నా భట్టికన్నా ముందు ఆమెను కలుస్తుంటారు . గత 14 సంవత్సరాలుగా ఆమె నియోజకవర్గంలో ప్రతి ఊరినే కాదు ప్రతి గడపాని తట్టారు . ఎక్కడన్నా కొద్దొగొప్పే భట్టి మీద అసంతృప్తి ఉన్న ఆమెపై లేదు …పైగా చాలామంది ఆమెను ఆప్యాయంగా అమ్మ అని పిలుస్తుంటారు .
శాసనసభలో భట్టి ప్రభుత్వంపై తన పదునైన మాటలతో విమర్శలు చేస్తారు . ఆయన చేసిన విమర్శలు ప్రభుత్వం సైతం పాజిటివ్ గా రెస్పాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సీఎం సైతం భట్టి చెప్పిన విషయాలు మంచివేనంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో భట్టి కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని అందుకే భట్టి మాటలకూ సీఎం రెస్పాండ్ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది సొంతపార్టీ వాళ్లే చేయడం గమనార్హం … ఆయన ఉన్నత విద్యావంతుడు … మంచి మాటకారి …ఒక స్థిరమైన ఆలోచనలు కలిగినవాడు … ఒకచేత్తో చేసేది మరో చేతికి తెలియదనే ప్రచారం ఉంది . ఈ విషయాన్నీ ఆయన వద్ద ప్రస్తావిస్తే నవ్వుతారు . అతనికి ఇతర వ్యాపార లావాదేవీలతో సంబంధాలు లేవు …పూర్తికాలం రాజకీయ నేతగా ఉంటున్నారు .
ఆయన “పంచకట్టు” ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది . ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు తరచు నియోజకవర్గంలో పర్యటిస్తుంటారు . కొద్దినెలల క్రితం నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు . అది ఆయనకు మంచి మైలేజ్ నిచ్చింది . అయితే రాష్ట్ర నేతగా ఉన్న భట్టి కేవలం నియోజకవర్గానికే పరిమితమవుతున్నారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. కనీసం జిల్లాపై కూడా పెద్దగా పట్టించుకోడని ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాత్రం తనకు పార్టీ అప్పగించిన భాద్యతలు తప్పకుండా చేస్తానని తన సొంత నిర్ణయాలు ఏవి ఉండవని అంటుంటారు .
భట్టి కుటుంబం మొదటినుంచి కాంగ్రెస్ పార్టీతో ఉంది .విక్రమార్క అన్న మల్లు అనంతరాములు ఉమ్మడి ఏపీలో నాగర్ కర్నూల్ ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు . ఒక సందర్భంలో అనంతరాములును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలనీ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. హఠాత్ గా ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు . ఆయన మరో సోదరుడు మల్లు రవి కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు . గతంలో ఆయన కూడా నాగర్ కర్నూల్ ఎంపీ గా పనిచేశారు . ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ వారిది చెరోదారి …తమ్ముడు సీఎల్పీ నేతగా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరిస్తుండగా ,మల్లు రవి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా టీపీసీసీ నేత రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటున్నారు …