అన్న కొడుకు పెళ్ళిలో అంతా తానై వ్యవహరించిన మంత్రి పువ్వాడ అజయ్ …
–తన కుమారుడితో సమానంగా అన్నకొడుకును చూసిన మంత్రి
–కొడుకు , మనవళ్ల ను చూసి ఉప్పొంగిన పువ్వాడ నాగేశ్వరరావు
–పువ్వాడ జీవితం చరితార్థం అంటున్న పలువురు ప్రముఖులు
–ఇద్దరి మనవళ్ల పెళ్లిళ్లు దగ్గరుండి కళ్లారా చూసి ఉప్పోగిన తాతా ,నాయనమ్మ లు…
–ఈజీవితానికి ఇదే చాలని ఆనంద భాష్పాలు రాల్చిన పువ్వాడ దంపతులు
–మంత్రిగా అజయ్ జీవితంలో మరుపురాని అనుభూతి
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి అజయ్ కుమార్ కొద్దికాలంలోనే తన కుమారుడితోపాటు , తన అన్న కుమారుడి పెళ్లిళ్లు చేశారు . ఇద్దరు కుమారులు నరేన్ రాజ్ నయన్ రాజ్ లు డాక్టర్లు కావడం విశేషం. వారిద్దరూ ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీ లోనే చదివారు …ఇద్దరికీ మంచి పెళ్లి సంభందాలు దొరికాయి. ప్రముఖ సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కు ఇద్దరు కుమారులు, వారిలో పెద్దవాడైన ఉదయ్ చనిపోయారు . తర్వాత ఆ కుటుంబ భాద్యత అంతా తండ్రి కొడుకు లైన నాగేశ్వరరావు , అజయ్ కుమారులే చూస్తున్నారు . ఉదయ్ భార్య జయశ్రీ కూడా ఖమ్మం మున్సిపాలిటీలో సిపిఐ కౌన్సిలర్ గా పనిచేశారు . ప్రస్తుతం మమతా మెడికల్ విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేస్తున్నారు . ఉదయ్ లేని లోటు ఎక్కడ కనపడనివ్వలేదు .. కుటుంబం అంతా పువ్వాడ నేర్పిన కమ్యూనిస్ట్ క్రమశిక్షణలో పెరిగింది… ఆబాటలోనే చాలాకాలం నడిచింది . పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయాల్లో ఆశక్తితో సిపిఐ నుంచి బయటికి వచ్చి మొదట కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత టీఆర్ యస్ లో చేరి తిరిగి ఖమ్మం నుంచి గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు . ఇప్పుడు ఆయన తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు .
పువ్వాడ ఫ్యామిలీ పూర్తిగా రాజకీయ నేపథ్యం కలిగి ఉంది ….ఉదయ్ , అజయ్ ల పిల్లలు ఇద్దరు డాక్టర్లు కావడం …వారి కుటుంబ చరిత్ర నేపథ్యంలో ఇద్దరికీ మంచి సంభందాలు లభించడం సంతోషించ తగ్గ విషయం … పువ్వాడ నాగేశ్వరరావు ఇద్దరి మనవళ్ల , పెళ్లిళ్లలో విషయంలో మంత్రి అజయ్ అంతా తానై వ్యవహరించారు . తన సొంతకొడుకుతో సమానంగా అన్న కొడుకు పెళ్లిని ఘనంగా నిర్వహించారు .ఆయన్ను తన కొడుకుగా భావించి ఎక్కడ ఎలాంటి లోటు రాకుండా పెళ్లి అనే శుభకార్యాన్ని నిర్వహించడంతో పలువురు అజయ్ ని అభినందిస్తున్నారు . ఇక సిపిఐ వెటరన్ లీడర్ గా ఉన్న పువ్వాడ నాగేశ్వరరావు కు సైతం ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంభందాలు ,పలుకుబడి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సిపిఐ ఫ్లోర్ లీడర్ గా , మండలిలో సిపిఐ నాయకుడిగా వ్యవహరించారు . అనేక పరీక్షా సమయాల్లో ప్రభుత్వానికి మంచి సలహాలు అందించడంతోపాటు ప్రజాసమస్యలను సభ దృష్టికి తెచ్చి పరిష్కరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందారు .
ఇద్దరి మనవళ్ల పెళ్లిళ్లు దగ్గరుండి చూసిన పువ్వాడ నాగేశ్వరరావు ,విజయమ్మ దంపతులు , జీవితంలో ఇంతకన్నా ఇంకేమి కావాలని మురుసిపోయారు . తమ మనవళ్ళు ప్రయోజకులు అవ్వడమే కాకుండా పిల్లా జెల్లలతో కలకలం వర్ధిల్లాలని ఆశ్వీరదించారు . ఈజీవితానికి ఇది చాలని పువ్వాడ దంపతులు ఆనంద భాష్పాలు రాల్చడం అక్కడున్న పలువురి హృదయాలను కట్టిపడేసింది . మంత్రి అజయ్ కి కూడా జీవితంలో ఇది మరుపురాని అనుభూతి అనడంలో సందేహంలేదు …
పెళ్లి ఈ నెల 8 న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగగా , రిసిప్షన్ ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు పలువురు ప్రముఖులు హాజరైయ్యారు . జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు , నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవి చంద్ర, బండి పార్థ సారధి రెడ్డి , బీఆర్ యస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యీ తాతా మధు , ఎమ్మెల్యేలు వనమా వెంకటేవరరావు , సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్ , మెచ్చా నాగేశ్వరరావు ,కందాల ఉపేందర్ రెడ్డి , రేగా కాంతారావు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి , పల్లా వెంకటరెడ్డి , ఇతర ప్రముఖులు వేల సంఖ్యలో హాజరైయ్యారు .