Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్…

ఆ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్…
-రాజ్యసభలో రంగా ప్రస్తావన తెచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
-కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్
-విజయవాడ ఎయిర్‌పోర్టుకూ వంగవీటి పేరు పెట్టాలని అభ్యర్థన

బీజేపీకి వంగవీటి మోహన్ రంగా పై ఒక్కసారిగా ప్రేమ పెరిగినట్లు ఉంది …ఇప్పటికే కృష్ణా జిల్లాను రెండుగా చేసిన ఏపీ సర్కార్ ఒకదానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టింది. మరోదానికి కృష్ణా జిల్లాగానే కొనసాగిస్తుంది. అయితే రెండు జిల్లాల్లో ఒకదానికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది . దీన్ని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ పట్టించుకోలేదని అందుకే అందుకే రాజ్యసభలో ప్రస్తహించాలిసి వచ్చిందని ఎంపీ జీవిల్ సభ దృష్టికి తెచ్చారు . ఆయన మాటల్లోనే

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు నేడు రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైన వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని కోరినా రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. విజయవాడ విమానాశ్రయానికి కూడా రంగా పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

‘‘వంగవీటి మోహన రంగా గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. రాష్ట్రంలోని ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న ప్రతిపాదన ప్రజల్లో ఉంది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టారు కానీ వంగవీటి రంగా పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకో మనస్సు రావట్లేదు. రంగా పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా కృష్ణా లేదా ఏదో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని సభాముఖంగా కోరుతున్నాను. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కూడా వంగవీటి మోహనరంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’’ అని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

విచిత్రమేమంటే ఆయన డిమాండ్ సహేతుకామో కాదో తెలియదు కానీ ఇవన్నీ ఓట్ల రాజకీయాలని ప్రజలు అనుకుంటున్నారు .

దేశంలో కాపులకు జరిగిన అన్యాయం మరెవరికి జరగలేదు …

కాపులకు రిజర్వేషన్ల అంశంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కాపులను టీడీపీ, వైసీపీ రెండూ మోసం చేశాయని అన్నారు. కాపులకు జరిగిన అన్యాయం ఈ దేశంలో మరెవరికీ జరగలేదని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. భూదోపిడీ, కుంభకోణాలకు ఎక్కడ అవకాశం ఉందో… అక్కడే వైసీపీ ప్రభుత్వం పనులు చేస్తోందని దుయ్యబట్టారు.

పారిశ్రామిక కారిడార్లకు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. మార్చిలో విశాఖలో ఇన్వెస్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ ఏం చెపుతారని ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్లను కూడా ప్రారంభించలేకపోయామని చెపుతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను, పెట్టుబడిదారులను వెళ్లగొట్టడంలో తాము సిద్ధహస్తులమని చెపుతారా? అని ఎద్దేవా చేశారు.

Related posts

దళితుల వ్యతిరేకత మధ్యనే దేవినేని ఉమ కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు!

Drukpadam

వాణి దేవి గెలుపు సంబరాల్లో అపశృతి …తెలంగాణ భవన్ లో అగ్ని ప్రమాదం

Drukpadam

ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరించేవాడే!: పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment