ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడనే వార్తలపై శ్రీలంక ప్రభుత్వ స్పందన
ప్రభాకరన్ బతికే ఉన్నాడని నిన్న ప్రకటించిన నెడుమారన్
ఈ వార్తలను కొట్టిపారేసిన శ్రీలంక ప్రభుత్వం
2009 మే 19న ప్రభాకరన్ హతమయ్యారన్న శ్రీలంక రక్షణ శాఖ
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు నెడుమారన్ చేసిన ప్రకటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారని… ఆయన కుటుంబం సూచన మేరకే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని నెడుమారన్ చెప్పారు. ఈ వార్త నిన్న దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. శ్రీలంకలో సైతం ప్రకంపనలు పుట్టించింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇదేమైనా జోకా? అంటూ శ్రీలంక రక్షణ మంత్రి అన్నారు. శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ… 2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు ధ్రువీకరించారని తెలిపారు. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించారని చెప్పారు. అందువల్ల నెడుమారన్ ఏ ఉద్దేశంతో ఆలా మాట్లాడారో తెలియదని పేర్కొన్నారు .ప్రభాకరన్ ను అమ్ముడే శ్రీలంక ఆర్మీ మట్టు బెట్టిందని ఆయన శవాన్ని కూడా గుర్తు పట్టరాని అందువల్ల బ్రతికుండటానికి అవకాశమే లేదని పేర్కొన్నది ….