తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం!
- ముందు వెళుతున్న జీపు, బైక్ ను తప్పించబోయిన బస్సు
- అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన వైనం
- ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు స్వల్ప గాయాలు
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో నేడు బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న జీపు, బైక్ ను తప్పించబోయిన బస్సు ఘాట్ రోడ్డు పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. భాష్యకారుల సన్నిధి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన స్థలిలో ఎడమవైపు లోయ ఉండగా, కుడివైపున కొండరాయి ఉంది. కాగా, బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది.