Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న చంద్రబాబు…

జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న చంద్రబాబు…

-ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది: అచ్చెన్నాయుడు

-గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి..
-చంద్రబాబును విమర్శించిన వంశీ
-వంశీపై అదే రీతిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలు
-ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ అనుచరులు
-టీడీపీ కార్యాలయంలో సామగ్రి ధ్వంసం
-టీడీపీ ఆఫీసు ఆవరణలో కారుకు నిప్పంటించిన వైనం

గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబును ఎమ్మెల్యే వంశీ విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దాంతో, మా నాయకుడినే విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారు.

గన్నవరం ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన చంద్రబాబు
జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న చంద్రబాబు
పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని ఆగ్రహం

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగులబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చుతున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని చంద్రబాబు నిలదీశారు.

“రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది: అచ్చెన్నాయుడు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపించారు.

వైసీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

సిపిఐ ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముట్టడి వాయిదానా ? ..?రద్దా…??

Drukpadam

కేసి వేణుగోపాల్ పై పోలిసుల దురుసు ప్రవర్తన …ప్రియాంక గాంధీ ఫైర్

Drukpadam

‘అగ్ని పథ్’ ను రద్దు చేయాలి : సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్!

Drukpadam

Leave a Comment